మీరు మద్యం తాగుతారా? బీరు, వైను వంటివి తాగినప్పుడు నేరుగా సీసాతోనే తాగేస్తారా? అలా అయితే ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే, మద్యం బాటిళ్లలో మనుషుల ప్రాణం తీసే విష పదార్థాలు ఉన్నట్టు ఇటీవలే జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. రంగు, పారదర్శకంగా ఉండే బాటిళ్లలో కాడ్మియం, లెడ్ వంటి విషపదార్థాలు ఉన్నాయని బ్రిటన్‌లోని ప్లైమౌత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మద్యం, మార్కెట్లో వివిధ రంగుల్లో లభ్యమయ్యే గాజు బాటిళ్లు, గ్లాసులు, వస్తువులు, వాటిపై ఉండే స్టిక్కర్లను విశ్లేషించగా.. వాటిలో ప్రమాదకర స్థాయిల్లో లెడ్, కాడ్మియం ఉన్నట్టు తెలిసిందని పరిశోధకులు చెప్పారు.ఏడాది వ్యవధిలో పలు దుకాణాల నుంచి సీసాలను సేకరించి, ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్ స్పెక్టోమెట్రీతో విశ్లేషించగా.. 76 శాతం బాటిళ్లలో లెడ్, 55 శాతం సీసాల్లో కాడ్మియం స్థాయికి మించి ఉన్నట్టు తేలిందని చెప్పారు. ముఖ్యంగా ఆకుపచ్చ రంగు సీసాల్లో భారీ స్థాయిలో క్రోమియం ఉందని పరిశోధకులు వెల్లడించారు. రీసైక్లింగ్ చేసిన సీసాలయితే మరింత ప్రమాదకరమని తెలిపారు. ఈ తరహా సీసాలను వీలైనంత తక్కువగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి మేలని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డా. ఆండ్రు టర్నర్ సూచించారు.
మీ ఆకుపచ్చ బీరు సీసాలొ విష పదార్థాలు ఉన్నాయి
Related tags :