వినడానికి వింతగా ఉండొచ్చు కాని ఒకప్పటి హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ బొడ్డుపై ఆమ్లెట్ వేస్తానంటూ పట్టుపట్టాడట ఒక సినీ నిర్మాత. ఈ విషయాన్ని మల్లికా షెరావత్ స్వయంగా ఇటీవల వెల్లడించింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మల్లిక ఇటీవల తాను నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన గ్లామర్‌ను తెరపై పరిచేందుకు నిర్మాతలు ఎలా తాపత్రయ పడేవారో వివరించే ఒక పాత సంఘటనను ఆమె గుర్తుచేసుకుంది. ఒక సినిమాలో పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర నిర్మాతకు ఒక కొత్త ఆలోచన పుట్టిందట. ఇంతటి సెక్సీ, హాట్ స్టార్‌ను మామూలుగా చూపెడితే ఏం బాగుంటుందని భావించిన ఆ కొత్త నిర్మాత మల్లిక బొడ్డుపై ఆమ్లెట్ వేస్తున్నట్లు చూపిద్దామని అన్నాడట.బిత్తరపోయిన కెమెరామెన్ మల్లిక వద్దకు వచ్చి నీ బొడ్డుపై ఆమ్లెట్ పోద్దామంటున్నాడు నిర్మాత..ఓకేనా అన్నాడట. దీంతో కంగారుపడడం తన వంతైందని ఆమె నవ్వుతూ చెప్పింది. అలాగే తనతో నటించిన చాలామంది హీరోలు తెరవెనుక సాన్నిహిత్యాన్ని ఆశించారని, అయితే తాను అందుకు నిరాకరించడంతో తనకు దక్కాల్సిన చాలా అవకాశాలు ఆ హీరోల గర్ల్‌ఫ్రెండ్స్‌కు వెళ్లిపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఎన్నడూ ఎవరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించలేదని, నిర్మొహమాటంగా మాట్లాడడమే తన నైజమని ఆమె స్పష్టం చేసింది.
బొడ్డు మీద గుడ్డు
Related tags :