ముంబైలో కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈప్రభావం సెలబ్రిటీ పై కూడా గట్టిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సినీ తారలకు షూటింగ్‌లు, ప్రయాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలకు ఇబ్బందలు ఎదురవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు సాగుతున్నాయా అంటూ ముంబై మున్సిపాలిటీ, ముంబై పోలీస్, ఎయిర్‌పోర్ట్ వర్గాలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై స్పదించిన రకుల్ ప్రీత్ సింగ్ ‘గత రాత్రి నుంచి ఒక్క ఫ్లైట్ కూడా కదల్లేదు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయాను’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రకృతి దెబ్బకు ఇరుక్కుపోయింది
Related tags :