సాధారణ మరుగుజ్జుతనంతో ఎదుగుదల లేని పిల్లలో పెరుగుదలను ప్రోత్సహించే కొత్త డ్రగ్ వొసొరిటైడ్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ డ్రగ్ ఎముకల అభివృద్ధిని క్రమబద్ధీకరిస్తుంది. పిల్లల్లో పెరుగుదలను చూపిస్తుంది. డ్రగ్ వొసొరిటైడ్ ను ఐదు నుంచి పధ్నాలుగేళ్ల లోపు పిల్లల్లో పరీక్షించారు. మరుగుజ్జుతనం అన్నది జన్యు పరమైన ఎముకల వైకల్యం. ప్రతి 25000 మందిలో ఒకరికి వస్తుంది.ఎఫ్‌జిఎఫ్‌ఆర్ 3 అనే జన్యు మార్పు వల్ల అవయవాల్లోని ఎముకల్లో, వెన్నుముక, పుర్రె అడుగున పెరుగుదల లేకుండా చేస్తుంది. మరుగుజ్జు పిల్లల్లో ముఖ్యంగా వెన్నుముక కుదించుకు పోతుంది. వెన్పుముక వంకర తిరిగి దొడ్డికాళ్లు ఏర్పడతాయి. ఇటువంటి పిల్లల్లో సగానికి సగం మందికి వెన్నుముక సర్జరీ లేదా ఇతర సర్జరీలు అవసరమవుతాయి. ఈ పిల్లలు ఎక్కువ కాలం స్కూలుకు వెళ్లలేక సామాజిక సంబంధాలను కోల్పోతుంటారు.పెరుగుదలకు హార్మోన్ వాడకం, అవయవాల పటిష్టతకు సర్జరీ వంటి చికిత్సల వలె కాకుండా వొసొరిటైడ్ మరుగుజ్జు తనం దాపురించడానికి గల మూలకారణాలు ఏమిటో కేంద్రీకరిస్తుంది. పెరుగుదలకు అవరోధమైన జన్యు మార్పుపై నేరుగా పనిచేసి అడ్డుకుంటుంది. ఈ అధ్యయనం ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, పరిశోధనా కేంద్రాల్లో నాలుగేళ్ల పాటు కొనసాగింది.
ఈ నూతన మందుతో మీ పిల్లల ఎత్తు పెంచవచ్చు
Related tags :