Sports

శుభం. ఆటకు శాశ్వత వీడ్కోలు.

Ambati Rayudu Bids Farewell To International Cricket

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయడుకు బదులు జట్టులో స్థానం సంపాదించుకున్న విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెండో సారీ అవకాశం రాలేదన్న నిరాశతో ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో స్టాండ్‌ బైలో ఉన్నప్పటికీ రాయుడికి అవకాశం రాకపోవడం గమనార్హం.క్రికెట్‌ కెరీర్‌లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1,694 పరుగులు చేశాడు. ఆరు అంతర్జాతీయ టీ20లు ఆడి 42 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌ల్లో 3,300 పరుగులు రాయుడు చేశాడు. చివరిగా ఐపీఎల్‌ -2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచులు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు.