Health

విధుల నుండి వైదొలగిన బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్ డా.గుడారు జగదీశ్

BIRD Hospital Director Gudaru Jagadish Relieved Of Duties

తితిదే ఆద్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ పదవి నుంచి డా.గుడారు జగదీశ్ వైదొలిగారు. తితిదే చైర్మన్ పుట్టా సుదాకర్ యాదవ్ ఆద్వర్యంలో ఇటీ వల నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆయన పదవీ కాలాన్ని రెండేళ్ళ పాటు పొడిగించారు. అయితే సదరు ఉత్తర్వ్యుల పై తితిదే ఈవో సంతకం చేయకపోవడంతో పదవేకాలం కొనసాగింపు పై సందిగ్దత నేలకుంది. మరోవైపు గుడారు జగదీశ్ పదవీకాలం ముగియడంతో సంబందిత పదవి నుంచి ఆయన వైదొలిగారు. ఉద్యోగ విరమణ కూడా చేయనున్నట్లు సంబంధిత పదవి నుంచి ఆయన వైదొలిగారు. ఉద్యోగ విరనమ కూడా చేయనున్నట్లు సమాచారం. దక్షిణాసియాలోనే అత్యుత్తమ ఆర్ధోపెడిక్ ఆసుపత్రిగా బర్డ్ ను తీర్చిదిద్దడంలో డాక్టర్ జగదీశ్ పాత్ర కీలకం. ఆయన ఆద్వర్యంలో బర్డ్ లో ఇప్పటి వరకు 1,28,000 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ప్రతిరోజూ ఆయన యాభై వరకు ఆపరేషన్ లు చేస్తారు. పేదరోగుల కోసం దేశ వ్యాప్తంగా 224 క్యాంపులు నిర్వహించి సుమారు 1,10,000 చిన్నారులను వైద్య సేవలను అందించారు. ఇరవై వేల మంది పిల్లలకు శస్త్ర చికిత్సలూ చేశారు. నిత్యం ఉదయం నాలుగు గంటల నుంచే రోగులకు అందుబాటులో ఉండే వైద్యుడిగా డాక్టర్ జగదీశ్ కు మంచి పేరుంది.