షాపుకెళ్లి ఉంగరాలు చూపించమంటే ముందు మన వేలి సైజు చూస్తారు. తర్వాత ఆ సైజులో ఉన్న ఉంగరాలు చూపిస్తారు. అలాకాకుండా మనకు నచ్చిన ఏ ఉంగరాన్నైనా మన వేలికి సరిపోయేలా తొడిగేస్తే… అవి మామూలు ఉంగరాలకన్నా భిన్నంగా అందంగా ఉంటే… బాగుంటుంది కదా. అలా వచ్చిందే ఈ ‘ఎడ్జస్టబుల్ ఫ్లెక్సి రింగ్స్’ ఫ్యాషన్. మామూలు ఉంగరాల్లా కాకుండా ఈ ఉంగరాలకు ఫొటోలో చూపినట్లూ చిన్న చిన్న చెయిన్లు ఓ హుక్కుకి కలిపి వస్తాయి. ఉంగరాన్ని తొడిగాక ఈ చెయిన్లను దగ్గరగా లాగి వేలికి సరిపోయేలా సెట్ చేసుకోవచ్చు. ఇక, వేలి పైభాగంలో రాళ్లూ పువ్వుల డిజైన్లతో పాటు కింది భాగంలో వేలాడే ఈ చెయిన్లు ఉండడం వల్ల ఇవి రెట్టింపు అందంగా ఉంటాయి. మీకూ నచ్చాయా..?
ఉంగరాలకు గొలుసులు
Related tags :