అసలే మన్నెం.. పూట గడవడమే కష్టంగా బతుకీడుస్తున్న గిరిజనం.. అడవిలో దొరికే ఆకులు తిని కాలం గడిపే మన్యం వాసులు క్షుద్బాధ తీర్చుకునేందుకు ఎర్రచీమల గుడ్లతో పచ్చడి చేసుకొని తింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో కనిపించిన దృశ్యాలివి.. ఇక్కడ జిన్నెచెట్లపై ఉన్న ఎర్రచీమలు, వాటి గుడ్లను సేకరించే పనుల్లో ఆదివాసీలు నిమగ్నమయ్యారు. వీరితో మాట్లాడగా.. ఎర్రచీమలు, వాటి గుడ్లతో పచ్చడి చేసుకొని తింటామని బదులిచ్చారు. సమీప ఛత్తీస్గఢ్ సరిహద్దులో వీటితో కూరను సైతం వండుకుంటారని అక్కడి ఆదివాసీలు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లోని సంతల్లోనూ చీమలు, వాటి గుడ్లను గొత్తికోయలు సేకరించి.. కుప్పలుగా పోసి విక్రయిస్తుంటారంటున్నారు.
ఎర్రచీమల పచ్చడి అంట తింటారా?
Related tags :