DailyDose

నాలుగు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా-వాణిజ్యవార్తలు–07/03

Daily Business News-RBI Fines Four Banks-July32019

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), యూకో బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు విధించింది. కేవైసీ అవసరాలు, కరెంటు ఖాతాల ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడమే కారణం. పీఎన్‌బీ, అలహాబాద్‌ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఒక్కో దానికి రూ.50 లక్షల చొప్పున, కార్పొరేషన్‌ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది.
*టెలికాం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇటీవల ఇచ్చిన స్పష్టత ఇది. అయినప్పటికీ ఈ సంస్థను మూసివేస్తారనే ఊహాగానాలు అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరహా ఊహాగానాలను సమర్ధిస్తూ కారణాలు చెప్పే వాళ్లూ ఉన్నారు. ఖండించే వాళ్లూ కనిపిస్తున్నారు. ఆఖరుకు తాజాగా ఆ సంస్థ కూడా మూసివేతకు అవకాశాల్లేవని స్పష్టత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
*రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) స్పెక్ట్రమ్ విక్రయం కేసులో టీడీశాట్ ఉత్తర్వులపై టెలికాం విభాగం (డాట్) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
*హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రముఖ మోడళ్లు యాక్టివా 5జీ, సీబీ షైన్ల్లో పరిమితకాల ఎడిషన్ను విపణిలోకి ప్రవేశపెట్టింది.
*చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ వర్షాకాల ఆఫర్ను ప్రకటించింది. ‘మాన్సూన్ సేల్’ పేరిట దేశీయ విమానాల్లో ప్రయాణించేవారికి ప్రారంభ టికెట్ ధరను రూ.888గా నిర్ణయించింది.
*సీకే బిర్లా గ్రూపునకు చెందిన ఓరియంట్ ఎలక్ట్రిక్ ఐలవ్ సిరీస్లో ఎల్ఈడీ దీపాల్ని ఆవిష్కరించింది. ఫ్లిక్కర్ (ఒక్కసారిగా ఆగిపోయి ఒక మెరుపు వచ్చినట్లు రావడమే ఫ్లిక్కర్) నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించినట్లు, ఇండియన్ మెడికల్ అకాడమీ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ (ఐఎంఏపీహెచ్) ఈ దీపాలను సిఫారసు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
*ప్రభుత్వానికి రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రూ.8000 కోట్ల మిగులు నిధులు బదిలీ చేయొచ్చని బిమల్ జలాన్ నేతృత్వంలోని ప్యానెల్ అంచనా వేసింది.
*మనదేశం నుంచి ఎగుమతులను గణనీయంగా పెంచుకునేందుకు వీలుగా బడ్జెట్లో కట్టుదిట్టమైన ప్రతిపాదనలు తీసుకురావాలని భారత ఎగుమతిదార్ల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఉద్యోగాల కల్పన, ఎగుమతులను పెంచుకోవటంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పాత్ర కీలకమని, అందువల్ల వీటిని ప్రోత్సహించటానికి ‘ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి నిధి’ ఏర్పాటు చేయాలని సమాఖ్య అధ్యక్షుడు శరద్ కుమార్ సరాఫ్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
*దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్యూవీ 300లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వెర్షన్ను విపణిలోకి ప్రవేశపెట్టింది.
*ఇంధన, ఐటీ షేర్లు దన్నుగా నిలవడంతో వరుసగా రెండో రోజూ సూచీలు రాణించాయి. జీఎస్టీ వసూళ్లు తగ్గడం, రుతుపవనాల పురోగతిపై ఆందోళనలతో ఎక్కువ భాగం నష్టాల్లోనే ట్రేడైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి.
* ఆర్థిక వృద్ధే మోదీ 2.0 ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. స్థూల దేశీయోత్పత్తిని (జీడీపీ) పరుగులెత్తించడానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందన్నారు.