మాజీ భార్య మహా కాస్ట్లీ.. 2.62 లక్షల కోట్లతో విడాకుల ఒప్పందం..
నువ్వే నా జాను.. నీతోనే నా జీవితం అన్నాడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్. 26 ఏళ్లు మెకెంజీతో కాపురం బోర్ కొట్టేసినట్టుంది. మరొకామెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు మెకెంజీకి తెలియడంతో నీకు నాకు కటీఫ్ అంటూ వెళ్లి పోయింది. వెళ్తూ వెళ్తూ.. ఊరికే వెళ్తానా అని భరణం కింద భర్త నుంచి 38 బిలియన్ డాలర్లు (2.62 లక్షల కోట్లు) ఇస్తున్నట్లు పేపర్ మీద సంతకం చేయించుకుని మరీ ఫ్లైట్ ఎక్కింది. అమెజాన్ బాస్ అపర కుబేరుడు. ఇక ఆయన భార్యగా మెకంజీ కూడా ప్రపంచంలోనే అత్యంత ధనిక మహిళగా నాలుగో స్థానంలో ఉన్నట్లు రికార్డుల కెక్కారు. అయితే భరణంగా వచ్చిన ఈ సొమ్ములో సగం వారెన్ బఫెట్, బిల్గేట్స్ స్థాపించిన ది గివింగ్ ప్లెడ్జ్ అనే ధార్మిక సంస్థలకు అందిస్తానని ఆమె వివరించారు. రచయిత అయిన మెకంజే 1993లో బెజోస్ని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. జెఫ్ వివాహేతర సంబంధమే వీరి వివాహ బంధానికి బీటలు వారినట్లు తెలుస్తోంది.
2.62 లక్షల కోట్లతో విడాకుల ఒప్పందం
Related tags :