Movies

మరిన్ని ఛాలెంజ్‌ల కోసం…

Kiara Advani On Kabir Singh Success

కియారా ఇప్పుడు అమితానందంగా ఉన్నారు. ఆమె నటించిన ‘కబీర్‌ సింగ్‌’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీనికి తోడు ఆ చిత్ర తెలుగు వెర్షన్‌ ‘అర్జున్‌ రెడ్డి’ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ఆమెకు ప్రత్యేకమైన గిఫ్ట్‌ పంపించారు. ఆమె నటనను ప్రశంసిస్తూ లేఖ రాయడంతో పాటు, డిజైనర్‌ వేర్‌ను జతపరచి పంపారని ఆమె స్వయంగా ఇన్‌స్టా ఖాతా ద్వారా వ్యక్తం చేశారు. ‘‘ తమ కంఫర్ట్‌ జోను నుంచి పక్కకు జరిగి చాలెంజింగ్‌ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను నేను ఆస్వాదిస్తున్నాను. నటిగా మరిన్ని చాలెంజింగ్‌ పాత్రలు చేయాలని ఉంది’’ అని ఆమె అందులో తెలిపారు.