బీజేపీతో నేతలతో జేసీ భేటీ..బాబుకు చెప్పే: పయ్యావులకుఇలా ఆఫర్: క‌్యూ లో పరిటాల ఫ్యామిలీ..!
బీజేపీ నేతలు ఆపరేషన్ అనంత వేగవంతం చేసారు.
ఇప్పటికే అనంతపురం నుండి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదా పురం సూరి బీజేపీలో చేరారు.
ఇక కొద్ది రోజులుగా అనంతపురం టీడీపీ నేతలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు.
ఇక అందులో భాగంగా జిల్లాకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్‌తో కలిసి ఢిల్లీలో బీజేపీ నేతల తో సమావేశమయ్యారు.
ఇక ఇదే జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత పయ్యావుల కేశవ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే విధంగా అనంతపురం టీడీపీలో మరో ప్రధాన కుటుంబం పరిటాల.
ఇప్పుడు ఆ పరిటాల వర్గం సైతం తర్జన భర్జన పడుతోంది. వీరితో బీజేపీ నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.