అనన్య.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరిది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న నానుడిని నిజం చేస్తున్న ఈ చిన్నారికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. అనితర సాధ్యమైన ప్రతిభతో పసిప్రాయంలోనే రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది అనన్య. కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలో తనదైన ముద్ర వేసిన ఈ చిన్నారి జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రదర్శనల్లో ఎన్నో ఎన్నో బహుమతులు అందుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన కిలారు హనుమంతరావు – నీరజల గారాలపట్టి అయిన అనన్య రెండేళ్ళ వయసులోనే కాళ్ళకు గజ్జే కట్టింది. అప్పటి నుంచి అదే లోకంగా ముందుకు సాగుతోంది మరోవైపు చదువులోనూ రాణిస్తూ అందరి ప్రసంసలు అందుకుంటోంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకున్న అనన్య .జాతీయ స్థాయిలో ఈ ఏడాది ఇండియన్ రైజింగ్ స్టార్ అవార్డు – 2019 గ్లోబల్ ఫ్రైడ్ అవార్డులకు ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ‘బాలనర్తకి’ నర్తనబాల అవార్డులు అందుకుంది. ఇక, బహుమతులకైతే లెక్కేలేదు. పన్నెండవ ఇంటర్నేషనల్ కల్చరల్ ఒలింపియాడ్ ఆఫ్ పెర్మా ఫామింగ్ ఆర్ట్స్ భరత నాట్యం సబ్ జూనియర్ విభాగంలో ప్రధమ బహుమతి, సత్తుపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెస్టివల్ లో ప్రధమ బహుమతి అందుకుంది. లివ్ అండ్ లెట్ లివ్ పౌండేషన్ ప్రధమ వార్షికోత్సవంలో రాష్ట్ర స్థాయి ఐడియల్ క్లాసికల్ డ్యాన్స్ అవార్డును కొల్ల గొట్టింది. లక్నోలో జరిగిన ఆలిండియా క్లైస్కల్ డ్యాన్స్ పోటీల్లో ప్రధమ బహుమతి ఆలిండియా డ్యాన్స్ ఫెస్టివల్ 2018లో కల్పవృక్ష జాతీయ అవార్డు హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవంలో విశిష్ట బాలరత్న నాట్య విపంచి అవార్డులు అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలు అందుకుంది అనన్య. లేత బుగ్గల చిరుప్రాయంలోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్న అనన్యకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో తెలుగు బాష, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)నుంచి అనన్యకు పిలుపొచ్చింది. ప్రదర్శన ఇవ్వాలంటూ అనంయకు ప్రత్యెక ఆహ్వానం అందింది. ఈనెల 4 నుంచి 6వరకు వాషింగ్టన్ లో నిర్వహించనున్న 22వ తానా సభల్లో అనన్య నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఈ సభల్లో అనన్యతో పాటు ఆమె తల్లిదండ్రులు నీరజ-హనుమంతురావులు కూడా పాల్గొననున్నారు. పాలబుగ్గల పసివయసులో దేశానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న చిరంజీవి అనన్య మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం.
తానా సభల్లో చిన్నారి అనన్య ప్రదర్శన
Related tags :