క్యాల్షియం వంటి దృఢమైన మినరల్స్తో ఎముక తయారవుతుంది. ఎముకల వల్లనే శరీరం ఒక నిర్ణీత ఆకారంలో ఉంటుంది. కదలడానికి, రక్తకణాల ఉత్పత్తికి, కండరాలకు సపోర్ట్ అందిస్తూ, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలకు రక్షణ కల్పించడంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తుంటాయి.శరీరానికి ఒక రూపం ఎలా ఏర్పడింది? కాళ్లు, చేతులు ఎలా కదల్చగలుగుతున్నాం? గుండె, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలకు రక్షణ ఎలా లభిస్తోంది? వీటన్నింటికి సమాధానం అస్థిపంజరం. అవును.. ఎముకల గూడు వల్లే అవన్నీ సాధ్యమవుతున్నాయి.ఎలాంటి జాయింట్ లేకుండా ఉండే ఎముక కంఠం భాగంలో ఉంటుంది.అతి చిన్న ఎముక చెవిలో(2.8మి.మీ)ఉంటుంది. అత్యంత పొడవైన ఎముక తొడ భాగంలో ఉంటుంది.మానవ శరీరంలో 206 ఎముకలుంటాయి. ప్రతి ఎముక మూడు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఎముక బయటి భాగాన్ని కాంపాక్ట్ బోన్ అంటారు. ఇది దృఢంగా ఉంటుంది. రెండో పొరను స్పాంజీ బోన్ అంటారు. ఇది అంత దృఢంగా ఉండదు. లోపలి పొరను ఎముక మజ (బోన్మ్యారో) అంటారు. ఇది ఎముక మధ్యలో జెల్లీ మాదిరిగా ఉంటుంది.ఎముక మజ్జలోనే ఎర్ర రక్తకణాలు, తెల్లరక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. మనిషి శరీర బరువులో బోన్మ్యారో 4 శాతం బరువు ఉంటుంది.ఛాతీ భాగంలో 12 జతల ఎముకలు ఉంటాయి. దంతాలు కూడా అస్థిపంజర వ్యవస్థలో భాగమే. అయితే వాటిని ఎముకలుగాలెక్కించరు.మనిషి ఎత్తు ఎముకల పెరుగుదలపైనే ఆధారపడి ఉంటుంది. బాలికల్లో 16 ఏళ్ల వయస్సు వరకు, మగపిల్లల్లో 18 ఏళ్ల వయస్సు వరకు ఎముకలు పెరుగుతాయి.ఎముకల కీళ్ల భాగంలో కార్టిలేజ్ ఉంటుంది. ఎముకలు రాపిడికి గురికాకుండా కార్టిలేజ్ కాపాడుతుంది.ఎముకకు గాయమైతే దానంతట అదే నయమవుతుంది. విరిగిన ఎముక మళ్లీ పెరుగుతుంది.నిజానికి మనిషి శరీరంలో దవడ ఎముక మాత్రమే కదులుతుంది. ఆహారం తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దవడ ఎముక కదులుతూ ఉంటుంది.
మీ ఎముకల దృఢత్వానికి ఆహారమే ప్రథమం
Related tags :