DailyDose

కార్యకర్తలకు కొండంత అండగా ఉంటా-రాజకీయ-07/04

Chandrababu Says He Will Safeguard TDP Cadre-Daily Politics-July42019

* తెలుగుదేశంపై పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌పై దాడులు రోజురోజుకు ఉధృతం కావడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా నిలిచేందుకు గుంటూరు పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ప్ర‌త్యేక విభాగాన్ని నెల‌కొల్పామ‌ని తెలిపారు. వైకాపా వర్గీయులు చేసే దాడులు, బెదిరింపుల‌కు సంబంధించిన స‌మాచారాన్ని, టీడీపీ ప్ర‌త్యేక విభాగం నెంబ‌ర్‌ 7306299999కి ఫోన్ చేసి తెలియ‌జేయాల‌ని‌ కోరారు. పార్టీపరంగా కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు అన్నివిధాలా స‌హాయం అందిస్తామ‌న్నారు. 40‌రోజుల్లో వంద చోట్ల పైగా దాడులు, దౌర్జన్యాలు చేయడం గర్హనీయం. ఆరుగురిని అత్యంత దారుణంగా చంపేయడం కిరాతకం. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకే ఈ ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామ‌ని లోకేష్ తెలిపారు. వారెంత కవ్వింపు చర్యలకు దిగినా టిడిపి కార్యకర్తలు సంయ‌మ‌నం పాటిస్తున్నారంటూ అధికారం అండతో వైకాపా వర్గీయులు రెచ్చిపోవడాన్ని ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా, దౌర్జన్యాలకు పాల్పడినా త‌క్ష‌ణ‌మే పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక‌విభాగం నెంబ‌ర్‌ 7306299999కి ఫోన్ చేసి స‌మాచారం అందించాల‌ని కోరారు. చ‌ట్ట‌ప‌ర‌మైన‌, న్యాయ‌ప‌ర‌మైన స‌హాయం ఆయా కుటుంబాలకు పార్టీ తరఫున అంద‌జేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. అందుకోసమే ప్రతి జిల్లాలో టిడిపి లీగల్ సెల్ ను సమాయత్తం చేస్తున్నాం అన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభివృద్ధిపై దృష్టిసారించాల‌ని, పేదల సంక్షేమ కార్య‌క్ర‌మాలకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని సూచించారు. విత్తనాల సమస్య, విద్యుత్ కోతల సమస్య, విద్యార్దుల మధ్యాహ్న భోజనం ఏ సమస్య వచ్చినా తెలుగుదేశంపై తోసి తప్పుకోవాలని సీఎం జగన్ చూడటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ చేతకాని తనం కప్పెట్టడానికే ఇటు సమస్యలు పరిష్కరించకుండా, అటు దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తూ రాష్ర్టంనలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కార్యకర్తలకు అన్నివేళలా, అన్నివిధాలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.
* పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట
పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ నేడు ముంబయి కోర్డు ఎదుట హాజరయ్యారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య ఘటనపై స్పందిస్తూ రాహుల్‌.. భాజపా-ఆరెస్సెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ ఆరెస్సెస్‌ కార్యకర్త రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై నేడు ముంబయి కోర్టు విచారణ చేపట్టింది. రాహుల్‌ విచారణకు హాజరై.. తానేం తప్పుచేయలేదని న్యాయస్థానం ముందు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాహుల్‌కు రూ. 15 వేల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మాజీ ఎంపీ ఏక్తానాథ్‌ గైక్వాడ్‌ రాహుల్‌కు హామీ ఇచ్చారు. ఈ కేసులో బెయిల్‌ పొందిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. ‘నాపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ పోరాటాన్ని నేను ఆస్వాదిస్తున్నాను’ అని తెలిపారు.
* టీడీపీ వీడటం బాధేసింది, కంటతడిపెట్టిన మాజీ ఎమ్మెల్యే.
నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే తాను బీజపీలో చేరాల్సి వచ్చిందని స్పష్టం చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలను చూసి బాధ కలిగిందన్నారు.
బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ధర్మవరం నియోజకవర్గానికి వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను ఎందుకు టీడీపీ వీడాల్సి వచ్చింది, బీజేపీలో చేరిన విషయంపై కార్యకర్తలతో చర్చించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే నియోజకవర్గంలో ఒక కార్యకర్తను నిర్ధాక్షిణ్యంగా చంపడం బాధ కలిగించిందన్నారు. అందువల్లే తాను బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు బాసటగా నివాలనుకున్నానని, అలాగే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషించుకుని టీడీపీని వీడి బీజేపీలో చేరినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వీడటం చాలా బాధగా ఉందని వరదాపురం సూరి భావోద్వేగానికి గురయ్యారు. కంటతడిపెట్టారు. 2023లో జరిగే జమిలి ఎన్నికల్లో మోదీ, అమిత్ షా నాయకత్వంలో రాష్ట్రంలో కూడా బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న ప్రతీ ఒక్కరికి అండగా ఉంటూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వదాపురం సూరి స్పష్టం చేశారు.
* రాహుల్‌ వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం
రాహుల్‌ గాంధీ చేస్తోన్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. రాహుల్‌ ఏనాడు ప్రజలకు దగ్గరలో లేరని విమర్శించారు. బీజేపీపై ఆయన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అతి విశ్వాసమే ఆ పార్టీ కొంపముంచిందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బీజేపీతో కలసి రావాలని అరుణ పిలుపునిచ్చారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. ఫారెస్ట్‌ అధికారిణిపై దాడి చేసిన సంఘటనపై సీఎం కేసీఆర్‌ ఇంత వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే మున్సిపల్‌ వార్డుల విభజన జరుగుతుందని ఆమె ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు విలువైన ప్రభుత్వ భూములు ఇవ్వటం పట్ల అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములపై అధికారులు పునః పరిశీలన చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.
* పోలవరం పూర్తి కాడానికి మరో మూడేళ్లు: రాజేంద్రకుమార్ జైన్
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ రాజేంద్రకుమార్‌జైన్ అభిప్రాయపడ్డారు.గురువారం నాడు విజయవాడలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాలను రాజేంద్రకుమార్ జైన్ మీడియాకు వివరించారు. 2022 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.కాఫర్ డ్యామ్ రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్థలపై ఈ సమావేశంలో చ ర్చించామన్నారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ పని పాక్షికంగానే పూర్తైందన్నారు. వరదలు రాకముందే పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు నిర్వహిస్తున్నట్టుగా ఆయ తెలిపారు.ఈ సారి పోలవరం డ్యామ్‌కు 10వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ వరద వల్ల కాఫర్ డ్యామ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటివరకు రూ.6700 కోట్లు విడుదల చేసిందన్నారు. శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ సభ్యులు పరిశీలిస్తారని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచే విషయం ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని రాజేంద్రకుమార్ చెప్పారు.
* చిదంబరానికి చిక్కులు: అఫ్రూవర్‌గా ఇంద్రాణీ ముఖర్జీయా…..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదరంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి చిక్కులు తప్పకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్‌గా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీయా అఫ్రూవర్ గా మారేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది.ఈ మేరకు ఇంద్రాణీ ముఖర్జీయా దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు అంగీకరించింది. ఇంద్రాణీ ముఖర్జీ తాను ఈ కేసులో అఫ్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ జడ్జి అరుణ్ భరద్వాజ్ గురువారం నాడు అనుమతిచ్చారు. ఈ కేసు విచారణను కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. తమ ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని కోర్టు ముఖర్జీయాను ఆదేశించింది. ఈ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
* చంద్రబాబు మీద జోక్ వేయబోయి.. : జగన్‌పై లోకేష్ ట్వీట్స్
అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్లో శాసనసభ, శాసనమండలి సభ్యులకు రెండు రోజులపాటు శిక్షణా కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు.. గత ప్రభుత్వం గురించి ప్రస్తావనకు తెచ్చారు. అయితే టీడీపీ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా ట్విట్టర్‌ వేదికగా లోకేష్ స్పందించారు.
* విద్యుత్‌ కోతలు మళ్లీ మొదలయ్యాయ్‌: బాబు
తాము పాలించిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా విత్తనాలు, ఎరువులు సమస్య లేకుండా చూశామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రైతులు ఇప్పుడు రోడ్డెక్కడానికి తెదేపాయే కారణమని వైకాపా నాయకులు అంటుండటం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని మీడియాతో చిట్‌చాట్‌లో ఆన్నారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో విద్యుత్‌ కోతలు లేకుండా చేశామని, కానీ, వైకాపా వచ్చిన నెలరోజుల్లో విద్యుత్ కోతలు మళ్లీ ప్రారంభమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ కోతల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు మండి పడ్డారు.
* ‘దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసంచేశారు’-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తానని.. పనికి రాని భూముల్ని అంటగట్టి వారిని అవమానపర్చారని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులన్నీ దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కోసం శంకుస్థాపన చేసి అటకెక్కించారని దుయ్యబట్టారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ భవన్‌ వద్ద భాజపా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
* చంద్రబాబు అబద్ధాలకోరు: సీఎం జగన్
మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అవలీలగా అబద్ధాలు చెబుతారని, ఆ విషయాన్ని ఆయనే అసెంబ్లీలో ఒప్పుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టుపై చంద్రబాబు తప్పుడు పేపర్లు చూపి మాట్లాడారని, మరుసటి రోజు ఒరిజినల్ పేపర్లు చూపించి వైఎస్ ఆయనను నిలదీశారని, అబద్ధమాడినట్లు చంద్రబాబు సభలో ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తాను అబద్ధమాడితేనే నిజాలు బయటికొస్తాయని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారన్నారు. చంద్రబాబు మాదిరి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పొద్దని, నిజాలే మాట్లాడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. బుధవారం ఏపీ అసెంబ్లీ హాల్ లో ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యేలు సభా నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. సభలో చట్టాలు చేసినవాళ్లే వాటిని ఉల్లంఘించే పరిస్థితులు రాకూడదన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యేవాడినని గుర్తు చేసుకున్నారు. ఏయే సబ్జెక్టులపై ఎవరు మాట్లాడతారో పార్టీ విప్లకు ముందుగానే పేర్లు ఇవ్వాలని, ప్రజాధనంతో నడిచే సభా సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. అవేశపడి మాట్లాడే కన్నా లాజిక్గా ప్రతిపక్షం ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. సభ నడుస్తున్న తీరును ప్రజలు చూస్తుంటారన్న విషయాన్ని మరచిపోరాదన్నారు. ఎమ్మెల్యేలందరికీ సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని, సభను హుందాగా నడిపిస్తామన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే మైకులు కట్ చేసే కల్చర్ తమ సర్కారులో ఉండదన్నారు.
* కర్నాటక పోలీసుల కస్టడీకి వరవరరావు
విరసం నేత వరవరరావును కర్నాటక పోలీ సులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌ బెటాలియన్‌పై నక్సల్స్‌ దాడి చేసిన కేసులో ఆయన్ను కస్టడీకి తీసుకున్నారని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 2005 తుమకూరు నక్సల్‌ దాడికి సంబంధించి ఎల్గార్‌ పరిషత్‌ (సదస్సు) కేసులో నిందితుడైన వరవరరావు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.
* వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త..
ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైసీపీలో చేరారు. డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ నేత అంబికా కృష్ణకు ఆయన సోదరుడు అవుతారు. ఇటీవల టీడీపీని వీడిన అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. కాగా ఈ కార్యక్రమంలో ఏలూరు వైసీపీ నాయకురాలు మధ్యాన్నపు బలరాం ఈశ్వరి, కొవ్వూరు, ఏలూరు నియోజకవర్గాల వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
* లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే: మోదీ
భారత్‌ నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలకు రూపునిచ్చేలా ఆర్థిక సర్వే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేపై ఆయన స్పందించారు. ‘‘ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారాలని దేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక సర్వే-2019 రూపునిస్తుంది. సామాజిక రంగం, సాంకేతికతను అందిపుచ్చుకునే లక్ష్యం, ఎనర్జీ సెక్యూరిటీ పురోగతి వంటి అంశాలను కూడా వర్ణిస్తోంది. దీన్ని చదవండి’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన లింకును ఆయన పోస్ట్ చేశారు.
* ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది – చంద్రబాబు
ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాయన్నారు. తాను కాస్త జాగ్రత పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది గెలుపుపై అతి విశ్వాసం ప్రదర్శించారన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వాఖ్యలు చేశారు. కార్యకర్తలకు స్పూర్తి నింపడంలో ఫెయిలయ్యామన్నారు. అదే సమయంలో ప్రజలను మేనేజ్‌ చేయడంలోనూ విఫలమయ్యామన్నారు చంద్రబాబు. తాను కూడా జాగ్రత్త పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది నేతలు గెలుపుపై ఓవర్‌ కాన్ఫడెన్స్‌ ప్రదర్శించారన్నారు చంద్రబాబు. అయితే రాష్ట్రంలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైయిందన్నారు చంద్రబాబు. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాయన్నారు. పించన్లు, విత్తనాలు, విద్యుత్‌ను సమయానికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అంతకుముందు.. సొంత నియోజకవర్గం కుప్పంలో రోడ్‌షో నిర్వహించారు చంద్రబాబు నాయుడు. అభిమానులు అడుగుడుగనా నీరాజనం పలికారు. కుప్పం పసుపు సంద్రంగా మారింది.
* వాటిపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు – లోకేష్
జగన్‌ సర్కారుపై మరోసారి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్‌. ఏపీ పోర్టుల వ్యవహారంలో జూన్‌ 28న జారీ అయిన ఆర్టీ -62 జీవో గుట్టు ఎంటోనని ప్రశ్నించారు. ముందు రహస్య జీవో అని చెప్పి రెండ్రోజుల్లోనే ఆ జీవో జారీ చేయబడలేదని మార్చారంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌. బందరు పోర్టు గురించి ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని.. సీఎం జగన్‌.. ఈ జీవోపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు లోకేష్‌.సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమన్నారు లోకేష్‌. ఇలాంటి పోర్టుపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారాయన. బందరు పోర్టు ఆంధ్రుల హక్కు అంటూ ట్విట్‌లో పేర్కొన్నారు లోకేష్‌.
* వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ
2014లో టీడీపీ చేసిన ఆరాచకాలనే.. ఇప్పడు వైసీపీ వాళ్లు చేస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కన్నా. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన కన్నా దాచేపల్లి పట్టణంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. మాచర్ల మండలం జమ్మలమడకలో బీజేపీ జెండా ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్న దిమ్మెను వైసీపీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల జోలికివస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు వైసీపీకి ఓ అవకాశం ఇచ్చారని..ఆ అవకాశాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన కార్యకర్తలకు కండువా కప్పి పార్లీలోకి ఆహ్వానించారు.
* నూతన ఇసుక విధానంపై సీఎం జగన్‌ సమీక్ష
ఏపీలో నూతన ఇసుక విధానంపై మంత్రులు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు సుచరిత, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇసుక విధానంతో ఆదాయం అంతా మాఫియా చేతుల్లోకి వెళ్తుందనే భావనతో ఉన్న సీఎం జగన్‌.. కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇసుక ద్వారా సమకూరే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే వచ్చేలా చేయడంతో పాటు ప్రజలకు సత్వరమే ఇసుక అందేలా నూతన విధానాన్ని తీసుకురానున్నారు.
* టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు కామెంట్స్
హౌసింగ్ విషయం లో షేర్ వాల్ టెక్నాలజీ సరైంది కాదని వైసిపి చెప్పగలదా…?పేదలు పురాతన ఇళ్లల్లోనే ఉండాలని జగన్ కోరికా…?నూతన ఇళ్ళల్లో పేదవారు ఉండకూడదా …?పేదవాళ్ళను చులకనగా చూడవద్దు.రాజీవ్ గృహాకల్ప పై కూడా విచారణ చేస్తే బాగుంటుంది.2004 నుంచి 2019 వరకు విచారణ చేస్తే మేం స్వాగతిస్తాం.అవినీతి రాజ్యానికి రాజు జగన్.వైసిపి వాళ్లు అవినీతి గురించి మాట్లాడం హస్యాస్పదం.
* టీడీపీ బాగుపడాలంటే లోకేశ్‌ను పక్కనపెట్టాలి..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీమంత్రి నారా లోకేశ్‌పై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘లోకేశ్‌ ఎంత మాట్లాడితే టీడీపీ అంత భ్రష్టు పడుతుంది. తెలుగుదేశం పార్టీ బాగుపడాలి అంటే లోకేశ్‌ను పక్కన పెట్టాలి. మహిళలను కించపరిచేలా లోకేశ్‌ మరోసారి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతోంది. ఇల్లు బాగు చేస్తూంటే ఎలుకలు ఏడ్చిన చందంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది’ అని దుయ్యబట్టారు.
*తెరాస’ కనుసన్నల్లో వార్డుల రిజర్వేషన్లు: కాంగ్రె
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలకు మేలు జరిగేలా వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాలని కోరారు. వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని…ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించే గడువును వారం రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు.
*ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిపై అధిష్ఠానానికి మరో నివేదిక
మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం మరో నివేదిక పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కమిటీ జారీచేసిన సంజాయిషీ నోటీసుకు ఆయన ఇప్పటికే వివరణ పంపారు. ఆ ప్రతిని కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి నేరుగా ఏఐసీసీకి పంపించారు.
* నలుగురూ భాజపా సభ్యులే
తెదేపాను వీడిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావులను భాజపా సభ్యులుగా గుర్తిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. వీరితోపాటు ఐఎన్ఎల్డీ నుంచి భాజపాలో విలీనం అయిన రామ్కుమార్ కశ్యప్ను (హరియాణా) కూడా భాజపా సభ్యుడిగా ఆ బులెటిన్ పేర్కొంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దీపక్ వర్మ ఈ బులెటిన్ను విడుదల చేశారు.
*పశ్చిమబెంగాల్ పేరును బంగ్లాగా మార్చండి
పశ్చిమబెంగాల్ రాష్ట్ర పేరును బంగ్లా గా మార్చే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగ ప్రక్రియను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి చేయాలని ఆమె కోరారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభకు తెలిపారు.
*పోర్టులపై జీవోలో గుట్టు ఏంటి?: లోకేశ్
ఏపీ పోర్టుల వ్యవహారంలో జూన్ 28న జారీ అయిన ఆర్టీ-62 జీవో గుట్టేమిటి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘‘ముందు ‘రహస్య జీవో’ అని ఇచ్చి.. రెండు రోజుల్లో ‘జారీ చేయబడలేదు’ అని మార్చారు. బందరు పోర్టుపై ప్రజల్లో అనుమానాలున్నాయి. జగన్ ఈ జీవో విషయమై స్పష్టత ఇవ్వాలి. పోర్టుపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు’’ అని ట్వీట్ చేశారు. ‘‘తన రాజభవనం ముందు 1.3 కి.మీ. రోడ్డు వేయడానికి రూ.5 కోట్లు, హెలిప్యాడ్కు రూ.1.89 కోట్లు ఖర్చు పెడుతున్న వైఎస్ జగన్ పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం.. పొదుపు చేయాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసేయాలా?’’ అని మరో ట్వీట్లో లోకేశ్ ప్రశ్నించారు.
*పోర్టులపై జీవోలో గుట్టు ఏంటి?: లోకేశ్
ఏపీ పోర్టుల వ్యవహారంలో జూన్ 28న జారీ అయిన ఆర్టీ-62 జీవో గుట్టేమిటి అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ‘‘ముందు ‘రహస్య జీవో’ అని ఇచ్చి.. రెండు రోజుల్లో ‘జారీ చేయబడలేదు’ అని మార్చారు. బందరు పోర్టుపై ప్రజల్లో అనుమానాలున్నాయి. జగన్ ఈ జీవో విషయమై స్పష్టత ఇవ్వాలి. పోర్టుపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు’’ అని ట్వీట్ చేశారు. ‘‘తన రాజభవనం ముందు 1.3 కి.మీ. రోడ్డు వేయడానికి రూ.5 కోట్లు, హెలిప్యాడ్కు రూ.1.89 కోట్లు ఖర్చు పెడుతున్న వైఎస్ జగన్ పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం.. పొదుపు చేయాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసేయాలా?’’ అని మరో ట్వీట్లో లోకేశ్ ప్రశ్నించారు. ‘‘2014కు ముందు ఇందిరమ్మ ఇళ్ల పేరిట రూ.4,150 కోట్లు దోపిడీ చేశారు. కానీ చంద్రబాబు పేదలకు అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లు కట్టించారు. 8,00,346 గృహాలు పంపిణీ చేశారు. మీ ప్యాలెస్లు కాకుండా.. మీ నాన్న హయాంలో కట్టిన అందమైన భవనం ఉంటే చూపండి’’ అని నిలదీశారు.
*బ్యాలెట్ విధానమే సరైంది: ఎంపీ కనకమేడల
ఈవీఎంలపై ప్రజలు, ఓటర్ల, భాగస్వామ్య పక్షాలకు సందేహాలున్నప్పుడు బ్యాలెట్ విధానమే అన్నింటికి సమాధామని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఎన్నికల సంస్కరణలపై రాజ్యసభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ మెరుగ్గా ఉండేందుకు పలు మార్పులు రావాలని ఆకాంక్షించారు. తమ పార్టీకి చెందిన నలుగురు సభ్యులను అధికార పార్టీ సభ్యులుగా చూపారని.. ఇది పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల నిరోధక చట్టానికి విరుద్ధమని తెలిపారు.
*ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిపై అధిష్ఠానానికి మరో నివేదిక
మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై పార్టీ అధిష్ఠానానికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం మరో నివేదిక పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కమిటీ జారీచేసిన సంజాయిషీ నోటీసుకు ఆయన ఇప్పటికే వివరణ పంపారు. ఆ ప్రతిని కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి నేరుగా ఏఐసీసీకి పంపించారు. గతంలో రాజగోపాల్రెడ్డి..పార్టీ, నాయకుల పట్ల వ్యవహరించిన తీరుపై మరో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఏఐసీసీ నుంచి క్రమశిక్షణ సంఘానికి ఆదేశాలు వచ్చాయి. అన్ని ఆధారాలనూ క్రోడీకరించి బుధవారం ఏఐసీసీకి నివేదిక పంపామని కోదండరెడ్డి వెల్లడించారు.