* తొలిసారిగా ఇంటర్‌నెట్ వాడే వారి కోసం ‘డిజిటల్ ఉడాన్’ పేరిట కొత్త ప్రోగ్రామ్‌ను రిలయన్స్ జియో లాంఛ్ చేసింది. ఇండియాలో డిజిటల్ లిటరసీ పెంచేందుకు ఈ చొరవ తీసుకుంటున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. ఇండియాలో 30 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లు డిజిటల్ బాట పట్టారని, వారిలో ఎక్కువ మంది మొదటిసారి ఇంటర్‌నెట్ వాడుతున్నారని తెలిపింది.
*అరబిందో ఫార్మా తయారీ యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలపై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
*యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) అధ్యక్షురాలిగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లగార్డేను ఎంపిక చేశారు.
*చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ దయానివాస్ శర్మ సూచించారు.
*ప్రస్తుత డిజిటల్ యుగంలో మారుతున్న నైపుణ్యాలకు అనుగుణంగా నియామకాలు చేపట్టేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సిద్ధమైంది.
*ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టబోతున్న తొలి బడ్జెట్లో మరిన్ని పన్ను ప్రోత్సాహకాలు ఉండొచ్చని ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు లోక్సభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.
*రెండు మూడు కంపెనీలు దివాలా తీసినంత మాత్రాన భారతీయ స్టాక్ మార్కెట్లకూ.. ఆర్థిక వ్యవస్థకూ వచ్చిన ప్రమాదమేమీ లేదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల్లో ఇప్పుడిప్పుడే కాస్త ఆదాయాలు కనిపిస్తున్నాయి.
CAలు డిజిటల్ టెక్నాలజీకి అలవాటుపడాలి-వాణిజ్యం-07/04
Related tags :