నివాస గృహ మార్కెట్లో ఈ ఏడాది తొలి అర్థభాగంలో హైదరాబాద్ గరిష్ఠ వార్షిక వృద్ధి(65 శాతం)ని నమోదు చేసింది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి 22 శాతంగా మాత్రమే ఉందని జేఎల్ఎల్ రూపొందించిన రెసిడెన్షియల్ మార్కెట్ అప్డేట్(2019 తొలి భాగం) నివేదికలో తెలిపింది. మొత్తం ఏడు నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని ఆ నివేదిక వెల్లడించింది. ఆ నివేదికలో ముఖ్యాంశాలు..
* దేశంలో ఈ ఏడాది తొలి అర్థభాగంలో కొత్త ప్రాజెక్టులు ఓ మోస్తరుగా ఉన్నా.. విక్రయాలు మాత్రం బలంగా నమోదు కావొచ్చు.
* మొత్తం కొత్త ప్రాజెక్టుల్లో అందుబాటు, మధ్యాదాయ(ముంబయిలో రూ.కోటి; ఇతర నగరాల్లో రూ.75 లక్షల వరకు) గృహాల వాటా దేశవ్యాప్తంగా 58 శాతానికి పెరిగింది. హైదరాబాద్లో మాత్రం ఇది అత్యంత తక్కువగా 28 శాతంగానే నమోదైంది. పుణెలో మాత్రం మొత్తం ప్రాజెక్టుల్లో వీటి వాటా 91 శాతంగా ఉంది.
* 2018లో మాదిరే 2019 తొలి భాగంలోనూ విక్రయాలు పెరిగాయి. మొత్తం విక్రయాల్లో ముంబయి, బెంగళూరు, దిల్లీ ఎన్సీఆర్ల వాటానే 60 శాతంగా ఉంది.
* పుణె తర్వాత చెన్నై, బెంగళూరుల్లో అత్యధికంగా అందుబాటు, మధ్య స్థాయి ధరల్లో గృహాలు ఎక్కువగా కనిపించాయి.
* ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటు గృహాలపై జీఎస్టీని 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించిన నేపథ్యంలో కూడా విక్రయాలు పుంజుకుంటాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి.
* చాలా వరకు నగరాల్లో కొనుగోలుదార్లు పూర్తయిన, పూర్తికాబోతున్న ప్రాజెక్టులపైన మాత్రమే ఆసక్తి చూపుతున్నారు.
* అగ్రగామి ఏడు నగరాల్లోనూ.. డెవలపర్లు అప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టు విక్రయంపైనే దృష్టి సారించడం వల్ల కొత్త నివాస ప్రాజెక్టులు 11 శాతం వరకు తగ్గాయి. ముంబయి, బెంగళూరు తప్ప.. మిగతా అన్ని నగరాల్లోనూ ఈ విషయంలో క్షీణత కనిపించింది.
రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ దూకుడు
Related tags :