* కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.6.01 కోట్ల ఆదాయాన్ని గడించింది.ప్రతి నెలా మొదటి గురువారంనాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. మొదటి, రెండు, మూడు, నాలుగు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 76,500 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది. మొదటి రకం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాటగిరి – 4,600 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ. 18,333/-గా ఉన్న బి క్యాటగిరి – 1000 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.66 లక్షల ఆదాయం లభించింది. రెండో రకం తలనీలాలో కిలో రూ.17,814/-గా ఉన్న ఏ క్యాటగిరి – 4,400 కిలోలను వేలానికి ఉంచగా 1,500 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.267.21 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ. 8,607/-గా ఉన్న బి క్యాటగిరి – 7,000 కిలోలు వేలానికి ఉంచగా 2,100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.180.76 లక్షల ఆదాయం లభించింది.మూడో రకం తలనీలాలో కిలో రూ.6,041/-గా ఉన్న ఏ క్యాటగిరి 1,400 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.84.65 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,554/-గా ఉన్న బి క్యాటగిరి – 22,900 కిలోలు వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు.కిలో రూ.1,801/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 6,600 కిలోలను వేలానికి ఉంచగా 300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.5.40 లక్షల ఆదాయం లభించింది.కిలో రూ.37/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 71,000 కిలోలను వేలానికి ఉంచగా అన్నీఅమ్ముడుపోయాయి. తద్వారా రూ.27 లక్షల ఆదాయం లభించింది.
* విప్లవ రచయిత వరవరరావును కర్నాటక పోలీసులు గురువారం తుమకూరు జిల్లాలోని పావగడ అదనపు సివిల్ జడ్జి, జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 2005 ఫిబ్రవరి 10న పావగడ తాలూకాలోని వెంకటమ్మనహల్లిలో నక్సల్స్ దాడిలో ఆరుగురు కర్నాటక ప్రత్యేక రిజర్వ్ పోలీసులతోసహా ఏడుగురు మరణించిన కేసులో 12వ నిందితుడిగా ఉన్న వరవరరావును బుధవారం పుణెలోని ఎరవాడ జైలు నుంచి కర్నాటక పోలీసులు తరలించారు.
* ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా ధనాన్ని ఉపయోగిస్తున్నారన్న కారణంతో రద్దు చేసిన తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఆగస్టు 5న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. తమిళనాడులోని ఇతర స్థానాలతోపాటు వెల్లూరు లోక్‌సభ స్థానానికి కూడా ఏప్రిల్ 18న ఎన్నిక జరగవలసి ఉంది. అయితే, డీఎంకేకు చెందిన ఒక వ్యక్తి నుంచి పెద్దమొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విచ్చలవిడిగా ధనబలాన్ని ఉపయోగిస్తున్నారన్న కారణంపై ఎన్నికల కమిషన్ ఆ నియోజకవర్గంలో మాత్రం ఎన్నికను రద్దు చేసింది. ఈ నెల 11న వెల్లూరు ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానున్నది. అదే రోజున నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ పత్రాల దాఖలుకు జూలై 18 చివరి రోజు. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు జూలై 22 గడువు తేదీ కాగా ఆగస్టు 9న వోట్ల లెక్కింపు జరుగుతుంది.
* సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి రాజ్యానికి రాజు జగన్ అని వ్యాఖ్యానించారు.
వైసీపీ నేతలు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హౌసింగ్ విషయంలో షేర్ వాల్ టెక్నాలజీ సరైంది కాదని వైసీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు. పేదలు పురాతన ఇళ్లల్లోనే ఉండాలని జగన్ కోరికా?, నూతన ఇళ్లల్లో పేదవారు ఉండకూడదా? అని నిలదీశారు. పేదవాళ్లను చులకనగా చూడొద్దన్నారు. రాజీవ్ గృహాకల్పపై కూడా విచారణ చేస్తే బాగుంటుందని హితవుపలికారు. 2004 నుంచి 2019 వరకు విచారణ చేస్తే టీడీపీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు
* లోక్‌సభలో ఇవాళ ఆధార్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆధార్‌కు బదులుగా రేషన్ కార్డు, పాస్‌పోర్టు లాంటి ద్రువీకరణ పత్రాలను కస్టమర్లు మొబైల్ కంపెనీలకు సమర్పించవచ్చు అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో 123.81 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయినట్లు మంత్రి చెప్పారు. సుమారు 69 కోట్ల మొబైల్ ఫోన్లకు ఆధార్ లింకు అయినట్లు మంత్రి తెలిపారు. 65 శాతం బ్యాంకు అకౌంట్లకు కూడా ఆధార్ లింకైందన్నారు. లోకాస్ట్ టెక్నాలజీతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చు అని, శాస్త్రవేత్తలు ఆ ఉద్ధేశంతోనే ఆధార్‌ను డెవలప్ చేసినట్లు మంత్రి రవిశంకర్ చెప్పారు.
* తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.
* అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,055 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో నూతనంగా 9,480 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారువీటిలో ఒక గ్రామ పంచాయతీతో కూడిన సచివాలయాలు 6,168… ఒకటి కంటే ఎక్కువ పంచాయతీలతో కూడినవి 3,312 ఉన్నట్లు వెల్లడించారు. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పరిపాలన వ్యవస్థ లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు.
* పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ రాజేంద్రకుమార్‌జైన్ అభిప్రాయపడ్డారు.
* గుంటూరుతాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కూర్పు, పలు విభాగాలకు నిధుల కేటాయింపులపై సీఎం సూచనలు చేశారు.
* తెదేపా ప్రభుత్వ హయాంలో చర్యల కారణంగానే రాష్ట్రంలో విత్తన సమస్య నెలకొందన్న వైకాపా ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు.
తమ ప్రభుత్వ పాలనలో ఒక్కసారి కూడా ఎరువులు, విత్తన సమస్యలు లేకుండా చేశామని గుర్తు చేశారు.
* అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,055 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో నూతనంగా 9,480 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారువీటిలో ఒక గ్రామ పంచాయతీతో కూడిన సచివాలయాలు 6,168… ఒకటి కంటే ఎక్కువ పంచాయతీలతో కూడినవి 3,312 ఉన్నట్లు వెల్లడించారు. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం గ్రామ పరిపాలన వ్యవస్థ లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ స్పష్టం చేశారు.
* పులికాట్ సరస్సు లో మళ్లీ మొదలైన ఆంద్రఆంధ్ర తమిళనాడు సరిహద్దు వివాదంతడ మండలం లోని రెండు కుప్పాలకు చెందిన 3 పడవలను11 మంది జాలర్లను బందించిన తమిళ జాలర్లుకాసింగాడు కుప్పం బీవీ పాలెం కుప్పం జాలర్లుతమిళనాడు సరిహద్దులోకి వచ్చారని నిర్బంధించిన పెదమాంగోడు కుప్పం జాలర్లువివాదం పెద్ద ది అవుతంది అని గ్రహించి ఆంధ్రా జాలర్లను విడిచిపెట్టిన తమిళ జాలర్లు
* పశ్చిమగోదావరిజిల్లాభాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ చేసిన జిల్లాకలేక్టర్ ముత్యాలరాజు. పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సస్పెన్షన్‌వీడియో సమావేశంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకుగాను పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డీపీవోను కలెక్టర్ ఆదేశించారు.
* ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, లోక కల్యాణం, సుపరిపాలన, దేవాలయాల సంస్కరణలు, సకాలంలో వర్షాలు, రైతన్నలకు మేలు వంటి అంశాల పై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారు తీసుకునే నిర్ణయాలకు.. భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుతూ.. ఇందు కోసం ఈ శనివారం (06-07-2019) ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అమ్మ కొండవీటి జ్యోతిర్మయి నవగ్రహ హోమం, రుద్ర హోమాలు పాల్గొని,వారికి ఆశీస్సులు అందించనున్నారు.
* రిపాలన పరమైన కారణాల వలన జూలై 5వ తేదీ శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు టిటిడి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది.
* ప్రమాణ స్వీకారం చేయకుండానే ఓ ఎంపీపీ పదవిని కోల్పోయింది.. విప్ దిక్కరించడంతో ఎంపీటీసీ కృష్ణవేణిపై వేటు పడింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. టిఆర్‌ఎస్ 2, కాంగ్రెస్ 5, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. ఇద్దరు స్వతంత్రులు టిఆర్‌ఎస్‌కు, మరో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఆరుగు సభ్యుల మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుటుందని అంతా భావించారు.
* సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇస్రో. ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించింది. 10 వేల మంది ప్రజలకు ఈ ఛాన్స్ దక్కబోతోంది. ఇవాల్టి నుంచి ఇస్రో వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకున్న వారికి.. ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇస్తోంది ఇస్రో.
* వేలూరు లోక్‌సభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. అక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. వేలూరులో ఆగస్టు 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు, 9వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా, వేలూరులో నియోజకవర్గంలో మాత్రం ఈసీ ఎన్నికను నిలిపివేసింది. ఎన్నికల సమయంలో వేలూరు లోక్‌సభ పరిధిలో భారీగా నగదు పట్టుబడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుంది. అయితే ఈ స్థానంలో డీఎంకే కూటమి తరఫున కదిర్ ఆనంద్, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా ఏసీ షణ్ముగంగత బరిలో నిలిచారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.
* బడ్జెట్ ధరల్లో అత్యాధునిక ఫీచర్లతో మొబైల్స్ ను విడుదల చేస్తోంది షామీ. తాజాగా మరో బడ్జెట్ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రెడ్‌మి 7ఏ పేరుతో గురువారం భారత విపణిలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.5,799గా నిర్ణయించారు(జులై నెల మాత్రమే). జులై 11 నుంచి ఇది ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో అందుబాటులోకి రానుంది. రెడ్‌మి 6ఏకు సక్సెసర్‌గా షామీ దీన్ని విడుదల చేసింది. ఇందు రెండు వేరింయట్లలో లభించనుంది.
* నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును వదిలివెళ్లిన ఘటన ఎల్బీనగర్ పీఎస్పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి వివరాల ప్రకారం ఎల్బీనగర్ బిగ్ బజార్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును వదిలి వెళ్లారు. ఏడుపులు విన్న పక్క బిల్డింగ్ వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పసి బిడ్డను తీసుకెళ్లి చైల్డ్ వెల్ఫేర్ కు అప్పగించారు. శిశువు వయసు మూడు నెలలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. వాచ్ మెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ లకు సీఈవోలను నియమిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న కొత్త జిల్లా పరిషత్‌ల ఆవిర్భావం, అదే రోజు తొలి సమావేశం ఉన్నందున ఉత్తర్వులు జారీ చేశారు. సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిలో ఉమ్మడి జిల్లా పరిషత్ లలో డిప్యూటీ సీఈవోలుగా, డీఆర్డీఏ పీడీ, ఏపీడీ, అకౌంట్ ఆఫీసర్లుగా, ఇతర శాఖలలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. గురువారం ఇతర శాఖల నుంచి రిలీవ్ అయి 5వ తేదీ విధుల్లో చేరాలని, అందుకు అనుమతి ఇవ్వాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు , జీహెచ్ ఎంసీ కమిషనర్లకు, ప్రమోషన్లు పొందిన అధికారులు పనిచేస్తున్న శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ పదవీకాలం ఆగస్టు 4 వరకు ఉంది. ఆ జిల్లా నుంచి నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిషత్ లు ఆగస్టు 5న ఏర్పాటు కానున్నాయి. సీఈవోలతో పాటు 32 జిల్లాలకు అకౌంట్ ఆఫీసర్లను కూడా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* హైదరాబాద్ నగరంలో ఆటంకాలు లేని సాఫీ ప్రయాణానికి బాటలు వేసిన మెట్రో రైల్ విశేష ఆదరణ పొందుతోంది. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రజలు మెట్రో ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు. సవాళ్లను అధిగమించి అందుబాటులోకి వచ్చిన మెట్రో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటోంది. మెట్రో వచ్చిన తర్వాత సిటీ లో ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గింది. మెట్రో ఒక్కో మైలురాయి దాటుకుంటూ ముందుకు సాగుతున్న మెట్రో రైల్ త్వరలోనే మరో ఘనత సాధించనుంది. నగరంలో ఐదు లక్షల ప్రయాణికుల మార్క్ ను దాటనుంది.
* తమిళనాడులోని వెల్లూరు ఎంపీ నియోజకవర్గ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వెల్లూరు ఎంపీ నియోజకవర్గానికి ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెద్దమొత్తంలో నగదు పట్టుబడటంతో వెల్లూరు ఎన్నికల పోలింగ్‌ను ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే.
* అనంతపురంజిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు రాజుకుంటున్నాయి. వైసీపీ నేతలు భోగాతికేతిరెడ్డి వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. భోగాతి మద్దతు దారుడు అయిన ఫీల్డు అసిస్టెంట్ వెంకటరమణపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డి అనుచరులు దాడి చేయడం కలకలం రేపింది.
*దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 5.42 లక్షల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ ప్రశ్నలకు బదులిచ్చారు.
*కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి ఈ నెల 25 నుంచి నీటిని తరలిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
*తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఆంధ్రా ప్రాంత స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులను తిరిగి ఇక్కడి సంస్థల్లోకి తీసుకోరాదని రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) కోరింది.
*హరితహారంలో భాగంగా కోటి ఈత, ఖర్జూర, తాటి మెుక్కలు నాటాలని ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఊరూరా పెద్దఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు, గీత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
*భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంపుహౌస్ పంపులకు ఒక్కక్కటిగా ఇంజినీర్లు ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు. బుధవారం వరుస క్రమంలో ఉన్న మొదటి పంపునకు ట్రయల్ రన్ నిర్వహించగా గ్రావిటీ కాలువలోకి గోదావరి జలాలు చేరాయి.
*వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్లలో బుధవారం కొద్దిసేపు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఐరోపా, అమెరికా, ఆఫ్రికాల్లో ఈ యాప్లు సరిగా పని చేయలేదని, దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వార్తలొచ్చాయి. భారత్లో ఈ యాప్ల పనితీరు కొంత నెమ్మదించింది. ముఖ్యంగా సాధారణ చాటింగ్ల వంటి వాటికి అంతరాయం లేకపోయినా ఫోటోలు, ఆడియో, వీడియో ఫైళ్లను అప్లోడ్, డౌన్లోడ్ చేసుకోవటంలో అంతరాయం తలెత్తినట్లు పలువురు ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
*గత నెల 1 నుంచి 9 వరకు తెలంగాణవ్యాప్తంగా అదృశ్యమైనవారికి సంబంధించి, పోలీసుల దర్యాప్తు వల్ల పలువురి జాడ లభించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ అడిగిన ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానమిస్తూ, మొత్తం 576 మందిలో 279 మంది ఆచూకీ లభించిందన్నారు. ఆ తొమ్మిది రోజుల్లోనూ నమోదైన కేసులు 537 అని చెప్పారు.
*జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదా నివేదికను ప్రాంతీయ భాషల్లో అనువదించి వెబ్సైట్లో ఉంచాలని పలు రాష్ట్రాల నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ స్పందించింది.
*సుప్రీంకోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనూ చదువుకోవచ్చు. తీర్పు కాపీలు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన సూచన ఈ నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులు అనువాదం చేయడానికి వీలుగా సాఫ్ట్వేర్ను సుప్రీంకోర్టు అభివృద్ధి చేస్తోందని ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి కూడా తెలిపారు.
*ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి! కచ్చితంగా ఆప్షన్లు ఈనెల 5 నుంచే మొదలవుతాయా అని అడిగితే అధికారులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) వచ్చే మూడేళ్లకు రుసుములను ఖరారు చేస్తోంది. కొన్ని కళాశాలలను ఈనెల 4 నుంచి 6 వరకు విచారణకు పిలిచి శాశ్వత ఫీజులు ఖరారు చేయనుంది.
*తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన ఖరారైంది. శుక్రవారం (5న) ప్రకాశం, 8న అనంతపురం జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికలయ్యాక వైకాపా దాడుల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడంతోపాటు వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించనున్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో
*దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈనెల 8న కడప జిల్లా జమ్మలమడుగులో రైతు దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ సమాధివద్ద నివాళులర్పించి అక్కడ నుంచి జమ్మలమడుగులోని రైతు దినోత్సవ సభావేదిక వద్దకు చేరుకుంటారు.
*ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి! కచ్చితంగా ఆప్షన్లు ఈనెల 5 నుంచే మొదలవుతాయా అని అడిగితే అధికారులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
తలవెంట్రుకల ఆదాయం ఆరు కోట్లు-తాజావార్తలు–07/04
Related tags :