మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ సాయంత్రం నిర్ణయం వెలువరించనుంది. వివేకా హత్యకేసులో బుధవారమే పోలీసులు శేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిజాలు నిగ్గుతేల్చేందుకు నార్కోఅనాలసిస్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్నకు నార్కోపరీక్షలు చేసేందుకు బుధవారం పులివెందుల న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే.
వై.ఎస్.వివేకా హత్య కేసు నిందితుడికి నార్కో పరీక్షలు
Related tags :