ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ (మైనే ప్యార్ కియా ఫేం) భర్త హిమాలయ దస్సానీ అరెస్ట్ అయ్యారు. ఓ గ్యాంబ్లింగ్ కేసులో భాగంగా ముంబయిలోని అంబోలీ ప్రాంతానికి చెందిన పోలీసులు దస్సానీని అరెస్ట్ చేశారు. స్థానిక న్యాయస్థానంలో ఆయన్ను ప్రవేశపెట్టిన అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఇటీవల సబర్బన్ జోగేశ్వరీ ప్రాంతంలో గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్న కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేపట్టగా దస్సానీ కూడా ఈ రాకెట్లో భాగస్వామేనని తెలిసింది. దాంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 1992లో దస్సానీ ‘పాయల్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా, వ్యాపారవేత్తగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇటీవల భాగ్యశ్రీ, దస్సానీల కుమారుడు అభిమన్యు ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
భాగ్యశ్రీ భర్త అరెస్ట్

Related tags :