NRI-NRT

ఆత్మీయంగా కలుసుకున్న చిత్తూరు ప్రవాసులు

Chittoor NRIs Meet At 2019 TANA 22nd Conference

అమెరికాలో నివసిస్తున్న చిత్తూరు జిల్లా ప్రవాసులు 22వ తానా మహాసభల్లో శుక్రవారం సాయంకాలం ఆత్మీయంగా కలుసుకున్నారు. డీ.కె.ఆదికేశవులునాయుడు కుమార్తె డీ.ఎ.తేజస్విని గీతాలపన అలరించింది. కొణిదెల లోకేష్ నాయుడు, పంత్ర సునీల్‌లు సమన్వ్యకర్తలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి తానా తదుపరి అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాల అధ్యాపకులు భాను, చిత్తూరు జిల్లా ప్రవాసులు కొమ్మినేని విజయ్, మిమిక్రీ కళాకారుడు మాధవ వర్మ తదితరులు ఈ సమావేశంలో ఆత్మీయంగా కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.