శ్రీలంక అందం జాక్వెలైన్ ఫెర్నాండెజ్ తెరపై కనిపించి ఏడాది గడిచిపోయింది. గత ఏడాది సల్మాన్‌ఖాన్ ‘రేస్ 3’లో ఆడిపాడింది. ఇప్పుడు ఈ అందాల తార ‘సాహో’లో మెరిసిందంటూ వార్తలొస్తున్నాయి. ఇందులో ఓ ప్రత్యేక గీతంలో ప్రభాస్‌తో కలిసి జాక్వెలైన్ చిందేసిందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘సాహో’ చిత్రీకరణ ఆస్ట్రియాలో జరుగుతోంది. ‘‘జాక్వెలైన్ ప్రస్తుతం ఆస్ట్రియాలోనే ఉంది. ప్రభాస్‌తో సరదాగా సాగే ఓ పాటలో పాల్గొంది. బాద్షా ఆలపించిన ఈ గీతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడే ప్రభాస్, శ్రద్ధాకపూర్‌పై వైభవీ మర్చంట్ నృత్య దర్శకత్వంలో మరో గీతాన్నీ తెరకెక్కించారు’’ అని జాక్వెలైన్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘సాహో’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఆగస్టు 15న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
సాహోలో జాకీ

Related tags :