DailyDose

2019 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు

Here is what you must know about the 2019 central budget

1.బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే..
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు నామామాత్రంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో.. ఏపీ, తెలంగాణలలోని యూనీవర్సిటీలకు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో తెలిపారు. ఏపీలోని సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు మరియు ఏపీ ట్రైబల్‌ వర్సిటీకి రూ. 8కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అదే విధంగా తెలంగాణలోని హైదరాబాద్‌ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు.
2. పెట్రోల్‌పై బడ్జెట్‌లో బాంబు పేల్చిన కేంద్రం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆమె చేసిన ఓ ప్రకటనతో సామాన్యుడి నెత్తిన బండపడినట్టయింది. అసలే.. పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయని చింతిస్తున్న సామాన్యుడికి కేంద్రం మరో షాకిచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 1రూపాయి సెస్ విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. అంతేకాదు, బంగారంపై కస్టమ్స్ సుంకం 10శాతం నుంచి 12.50 శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా బంగారం ధరలు కూడా పెరగనున్నాయి.
3. బడ్జెట్‌లో భారీ షాక్ ఇదే..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ ప్రకటన సామాన్య, మధ్య తరగతి వర్గాలను షాక్‌కు గురి చేసింది. బంగారంపై కస్టమ్స్‌ చార్జ్‌లు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. 10 నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. బంగారంపై కస్టమ్స్ చార్జ్‌ల పెంపుతో పసిడి ధరలు పెరగనున్నాయి.
4. వాళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన కేంద్రం
మధ్యతరగతి ప్రజలకు కేంద్రం బడ్జెట్‌లో శుభవార్త చెప్పింది. రూ.5లక్షల వరకూ సాంవత్సరిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతంలోనే ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్రం తాజా బడ్జెట్‌లో మరోమారు స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో కొన్ని కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. అయితే.. రూ.2 కోట్లకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి 3 శాతం సర్‌చార్జ్‌‌ను, రూ.5 కోట్లకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి 7 శాతం సర్‌చార్జ్‌ విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
5. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దేశ ప్రజలపై కురిపించిన వరాలివే..!
చైనా, అమెరికా తర్వాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. పారిశ్రామికవాడల ఏర్పాటుతో మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమైందని, ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. సంపదను సృష్టించడంలో మేకిన్‌ ఇండియా ప్రధాన పాత్ర పోషించిందని నిర్మల తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలను ఆమె ప్రస్తావించారు. ఆమె ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలివే…
***బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు
*దేశంలో 657 కి.మీ. మేర నడుస్తున్న మెట్రో రైళ్లు
*వాణిజ్య అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేస్తాం
*ఉడాన్‌ స్కీమ్‌తో చిన్న నగరాలకు విమాన సర్వీసులు
*చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యత
*విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి
*పారిశ్రామిక సంస్థలు సంపద, ఉపాధిని సృష్టిస్తున్నాయి
*సాగరమాల ద్వారా జలరవాణా మెరుగుపడుతోంది
*గంగానదిలో సరకుల రవాణా నాలుగురెట్లు పెంచుతాం
*విద్యుత్‌ వాహన వినియోగదారులకు ఇన్సెంటివ్‌లు
*ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్లలో అనేక మార్పులు తెచ్చాం
*రైల్వేల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
*రవాణా రంగం కోసం కొత్త రూపీ కార్డు
*ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం మూడేళ్లలో రూ.10వేల కోట్లు
*జాతీయ రహదారుల గ్రిడ్‌ ఏర్పాటు
*పవర్‌గ్రిడ్‌ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్‌ సరఫరా
*విద్యుత్‌ టారిఫ్‌ పాలసీలో సంస్కరణలు అవసరం
*కోటిన్నర మంది చిరు వ్యాపారులకు పెన్షన్‌ పథకం
*గ్యాస్‌ గ్రిడ్‌ హైవేల కోసం బ్లూ ప్రింట్‌
*రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
*చిన్నతరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణం
*జీఎస్టీలో నమోదు చేసుకున్నవారికి 2శాతం వడ్డీ రాయితీ
*చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థికసాయం కోసం రూ.350కోట్లు
*జాతీయ హౌసింగ్‌ రెంటల్‌ విధాన
6. ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల
దేశ భద్రత, ఆర్థిక వృద్ధికి జనం ఓటేశారని బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వ్యాఖ్యానించారు. సంస్కరణలు, మార్పే తమ అజెండా అని ఆమె చెప్పుకొచ్చారు. టెక్నాలజీతో అవినీతిని అరికట్టామని, ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 1.5ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2.5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచామని నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. ప్రస్తుత ఏడాదిలో మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.భవిష్యత్‌లో ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరడమే తమ లక్ష్యమని నిర్మల చెప్పారు. నవీన భారత్‌ రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని, ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందని నిర్మల చెప్పారు. మేకిన్‌ ఇండియాకు మంచి స్పందన వచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
7. ఎస్‌హెచ్‌జీ మహిళకు రూ. లక్ష రుణం
నారీ-నారాయణి ద్వారా మహిళల పురోగతిపై దృష్టిపెట్టినట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మహిళల భాగస్వామ్యంతోనే పురోగతి సాధించగలమని తమ ప్రభుత్వం నమ్ముతోందన్నారు. ఈ సందర్బంగా స్వామి వివేకానంద సూక్తిని ఆమె ప్రస్తావించారు. పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలున్నారని ఆమె గుర్తు చేశారు.మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. ముద్రా లాంటి పథకాలద్వారా మహిళా ఆర్థిక స్వావలంబనకు , మహిళా పారిశ్రామిక వేత్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. స్వయం సహాయక గ్రూప్‌ల(ఎస్‌హెచ్‌జీ) లో ఉన్న మహిళలకు రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్, గ్రూపులోని ఒక మహిళకు ముద్రా స్కీమ్ ద్వారా రూ.లక్ష దాకా రుణ సదుపాయం కల్పిస్తామని ఆమె చెప్పారు.
8. 2024 నాటికి ప్రతి ఇంటికి రక్షిత నీరు
దేశంలోని జలవనరుల విభాగాలన్నీ సమీకృతం చేస్తూ జల్‌శక్తి మంత్రాలయ్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి రక్షిత నీరు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే ఉన్న రాష్ర్టాల పథకాలతో కలిసి లక్ష్యం దిశగా జలజీవన్‌ ఉంటుందన్నారు.
వాననీటి సంరక్షణ, గృహ నీటి శుద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇక నుంచి వచ్చే నీటిని తిరిగి సాగు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం తీసుకువస్తామన్నారు. 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్‌ ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.
9. ఈ బడ్జెట్ దేశ ప్రగతికి మార్గం :ప్రధాని నరేంద్ర మోదీ
ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రగతికి మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ… తాజా బడ్జెట్ దేశ ప్రజల ఆశలు… ఆకాంక్షలు నెరవేరుస్తుందని అనుకుంటున్నాను. నవభారత నిర్మాణానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. వ్యవసాయరంగంలో పలు సంస్కరణలు చేపట్టాం. వ్యవసాయరంగానికి మేలుచేసిదిగా ఈ బడ్జెట్ నిలుస్తుంది. మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. యువత కలలు, సంకల్పం నెరవేరేలా బడ్జెట్ రూపొందించాం. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర పెంచే విధంగా బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ విద్యావిధానాన్ని బలోపేతం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేశం నిరాశా వాతావరణం నుంచి బయటపడిందన్నారు.
10. భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసు తీర్పును జులై 17న వెల్లడించనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. ది హేగ్లోని పీస్ ప్యాలెస్లో మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెలువరించనున్నారు న్యాయమూర్తి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసుఫ్.గూఢచర్యం ఆరోపణలతో 2016లో కుల్‌భూషణ్‌ జాదవ్‌ను ఇరాన్‌లో పాక్‌ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత బలూచిస్థాన్లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది.11. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. రైల్వే శాఖలో ఏటా కోట్ల పెట్టుబడుల అవసరం ఉందని తెలిపారు. దేశమంతటా మెరుగైన విద్యుత్ సేవల కోసం ‘ఒకే దేశం-ఒకే గ్రిడ్’ విధానం తీసుకొచ్చామని వెల్లడించారు. దీంతో విద్యుత్ ధరలు తగ్గాయని చెప్పారు. దేశంలో అన్నివర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని సీతారామన్ అన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆదుకునేందుకు ‘ఉదయ్’ను తీసుకొచ్చామని చెప్పారు. విమానాల ఫైనాన్సింగ్ విషయంలో దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
**2019-20 బడ్జెట్ హైలెట్స్..
దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానంవిద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు‘జల్ వికాస్ మార్గ్’ పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం ‘ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం’ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులుఈ పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలులిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయంఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచనసెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటుసామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు
12. కేంద్ర బడ్జెట్ లో అంశాలు…
1. గ్రామాల్లో పట్టణాన్ని మించే సదుపాయాల అమలు.
2 .రైతులకి ఏటా 6000 రూపాలయ నగదు సాయం.
3 . ఆయుష్మాన్‌ భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం.
4 . దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకూ విద్యుత్‌ సౌకర్యం.
5 . మారుమూల ప్రాంత గ్రామాలకూ బస్సులు.
6 . 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఏర్పాటు.
7 . దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి.
8 .దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్‌, త్వరలోనే హర్యానాలో 22వ ఎయిమ్స్‌.
9 . అంగన్‌వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు.
10 .జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
11 . ఈఎస్‌ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు.
12 . 143 కోట్ల ఎల్ఈడి బల్పుల పంపిణి.
13 . గోరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధం.
14 . కనీస పెన్షన్‌ రూ.3వేలు .
15 . ప్రధాని గ్రామ సడక్‌ యోజన ద్వారా రోడ్ల నిర్మాణం మూడింతలు పెరుగుదల.
16 . అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అందించడం.
17 . దీనివల్ల విద్యాసంస్థల్లో 2లక్షల సీట్లను పెంచడం.
18 . రైతులకు కనీస మద్దతు ధర 50 % పెంపు .
19 .చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం కిసాన్‌ పథకం అమలు .
20 . సైనికులకు ప్రత్యేక అలవెన్స్ లు.
21 . నెలకు రూ.100 చెల్లిస్తే నెలకు మూడు వేల పెన్షన్‌ పొందే అవకాశం.
22 . గ్రాట్యూటీ పరిధి 10 లక్షల నుంచి 30 లక్షల పెంపు.
23 . రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు.
24. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయినవారికి రుణాల రీషెడ్యూల్‌.
25 . సినీ నిర్మాణానికి సింగల్ విండో అనుమతులు.
26 . 12 % సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గింపు.
27 . టెలికం రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు.
28 . ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో వాయిస్,డేటా ప్లాన్స్.
29 . 2030 నాటికీ భారత్లో విద్యుత్తు వాహనాలు.
30 . రైల్వేశాఖ అభివృద్ధికి రూ. 64, 587 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు.
31 . సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో 10 % వృద్ధి.
32 . బ్యాంకింగ్‌ రంగంలో 4ఆర్‌ ప్రవేశం.
33 . బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టడం.
34 . ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్‌.
35 . వంట గ్యాస్ కనెక్షన్లు 6 కోట్ల నుండి 8 కోట్లకు పెంపు .
36 . మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశాం.
37 . రెండిళ్లు ఉన్నప్పటికీ అద్దెపై పన్ను మినహాయింపు.
13. రెడ్ బడ్జెట్ … కొత్త సాంప్రదాయాని కి తెరలేపిన కేంద్ర మంత్రి
బ‌డ్జెట్ అన‌గానే బ్రౌన్ క‌ల‌ర్ బ్రీఫ్‌కేస్‌ గుర్తుకు వ‌స్తుంది ! బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను బ్రౌన్ క‌ల‌ర్ బ్రీఫ్‌కేస్‌లో తేవ‌డం సాంప్ర‌దాయం. అయితే ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మ‌హిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నిర్మ‌లా.. కొత్త సాంప్ర‌దాయానికి తెర‌లేపారు. బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను బ్రీఫ్‌కేసులో కాకుండా.. ఎర్ర‌టి వ‌స్త్రంతో మూట‌క‌ట్టిన ప్యాక్‌లో ఆమె బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను పార్ల‌మెంట్‌కు తీసుకువెళ్లారు. ఎరుపు రంగు వ‌స్త్రంలో ఉన్న బ‌డ్జెట్ బ్యాగ్‌పై జాతీయచిహ్నం ఉంది. అంత‌క‌ముందు సీతారామ‌న్ సాంప్ర‌దాయం ప్ర‌కారం రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను వెళ్లి క‌లిశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు ఇత‌ర స‌భ్యుల‌తో నిర్మ‌లా సీతారామ‌న్ ఓ గ్రూపు ఫోటో కూడా దిగారు. ఎరుపు రంగు వ‌స్త్రంలో క‌ట్టి ఉన్న బ‌డ్జెట్ ప్ర‌తుల‌పై చీఫ్ ఎక‌నామిక్ స‌ల‌హాదారు కృష్ణ‌మూర్తి సుబ్ర‌మ‌ణ్య‌న్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇది భార‌తీయ సాంప్ర‌దాయం అన్నారు. పాశ్చాత్య బానిస‌త్వం నుంచి విముక్తిని ఇది సూచిస్తుంద‌న్నారు. ఇది బ‌డ్జెట్ కాదు అని, ఇది ఖాతా పుస్త‌కం (లెడ్జ‌ర్) అని ఆయ‌న అన్నారు. ఇవాళ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న సంద‌ర్భంగా ముంబైలోని ద‌లాల్ స్ట్రీట్ ప‌రుగులు తీసింది. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 40వేల మార్క్‌ను దాటింది.
14. ఈ ఏడాదే 3 ట్రిలియ‌న్ల డాల‌ర్లు దాటేస్తాం
కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ ఏడాదే 3 ట్రిలియ‌న్ల డాల‌ర్లు దాటుతుంద‌ని సీతారామ‌న్ తెలిపారు. మ‌నం 5 ట్రిలియ‌న్ల డాల‌ర్లు చేరుకున్న‌ప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతార‌ని ఆమె తెలిపారు. ఆ టార్గెట్ అందుకోడం సులువే అన్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌భుత్వం ఉంటే అది సాధ్య‌మే అన్నారు. ఈ మార్పులో సాధార‌ణ పౌరులే కీల‌కం అన్నారు. 2014లో 1.85 ట్రిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థు.. ఇప్పుడు 2.7 ట్ర‌లియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకుంద‌న్నారు. మ‌రో కొన్నేళ్ల‌లో 5 ట్రిలియ‌న్ల డాల‌ర్లు సాధ్య‌మే అన్నారు. ఫుడ్ సెక్యూర్టీపై చేస్తున్న ఖ‌ర్చు రెండింత‌లు అయ్యింద‌న్నారు.
15. చిల్లర వ్యాపారులకు పెన్షన్ స్కీం ..
సుమారు మూడు కోట్ల చిల్ల‌ర వ్యాపారుల‌కు పెన్ష‌న్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల తెలిపారు.
ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ,,,,వార్షిక ట‌ర్న్ఓవ‌ర్ 1.5 కోట్ల క‌న్నా త‌క్కువ ఆదాయం ఉన్న రిటేల్ ట్రేడ‌ర్ల‌కు పెన్ష‌న్ బెనిఫిట్ క‌ల్పించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి క‌ర‌మ్ యోగి మాన్ ధాన్ స్కీమ్ కింద ఇది వ‌ర్తిస్తుంద‌న్నారు. జీఎస్టీ కింద రిజిస్ట‌ర్ చేసుకున్న‌ మ‌ధ్య‌శ్రేణి సంస్థ‌ల‌కు 2 శాతం వ‌డ్డీతో రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. దాని కోసం సుమారు 350 కోట్లు కేటాయించిన‌ట్లు ఆమె తెలిపారు. కిరాయి ఇంటి చ‌ట్టాల‌ను మార్చ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. సామాజిక కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌త్యేక స్కీమ్‌ను ఏర్పాటు చేశారు. నిధుల స‌మీక‌ర‌ణ కోసం సోష‌ల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఏర్పాటు చేయ‌నున్నారు.
16. రైల్వే కు 50 ల‌క్ష‌ల కోట్లు కావాలి …
రైల్వే మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం సుమారు 50 ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌రం ఉంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. 2018 నుంచి 2030 వ‌ర‌కు అంత మొత్తం అవ‌స‌రం అవుతుంద‌న్నారు. వేగ‌వంత‌మైన అభివృద్ధి, ప్ర‌యాణికుల ర‌వాణా వ్య‌వ‌స్థ కోసం రైల్వేల్లో ప్రైవేటు భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. విమాన రంగం, మీడియా, యానిమేష‌న్‌, ఇన్సూరెన్స్ రంగాల్లో ఎఫ్‌డీఐని ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీల్లో మీడియేట‌ర్లుగా ఉండే సంస్థ‌ల‌కు వంద శాతం ఎఫ్‌డీఐని అనుమ‌తించ‌నున్న‌ట్లు నిర్మ‌ల తెలిపారు. పెట్టుబ‌డిదారుల‌ను ఆహ్వానించేందుకు త్‌ ర‌లో గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సును ఏర్పాటు చేయ‌నున్నారు.
17. జీరో బడ్జెట్ వ్యవసాయం పై దృష్టి ….
ఢిల్లీ వ్య‌వ‌సాయ‌రంగంలో ప్రైవేటు వ్యాపారుల‌ను ప్రోత్స‌హించ‌నున్నారు. వ్య‌వ‌సాయ రంగానికి మౌళిక స‌దుపాయాలు క‌ల్పించే అంశంపై మోదీ స‌ర్కార్ దృష్టి పెట్టిన‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తెలిపారు. ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతూ ఆమె మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌, ఈజ్ ఆఫ్ లివింగ్‌.. రైతుల‌కు కూడా చెందాల‌న్నారు. జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయాన్ని రైతులు ఆశ్ర‌యించాల‌న్నారు. రైతుల‌కు ఇది కొత్త మోడ‌ల్‌గా ఉండాల‌న్నారు. దీంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంద‌న్నారు. నీటి నిర్వ‌హ‌ణ చూస్తున్న మంత్రిత్వ‌శాఖ‌ల‌ను ఏకం చేసి జ‌ల‌శ‌క్తి మంత్రాల‌యాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు నిర్మ‌ల తెలిపారు. ప్ర‌తి ఇంటికి 2024లోగా నీటి అందించ‌నున్న‌ట్లు చెప్పారు. జ‌ల‌శ‌క్తి శాఖ కోసం నిధుల‌ను స‌మీకిరిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 9.6 కోట్ల మ‌రుగుదొడ్లు నిర్మించామ‌న్నారు. 5.6 ల‌క్ష‌ల గ్రామాలు బ‌హిర్భూమి నుంచి విముక్తి పొందాయ‌న్నారు. సుమారు 2 కోట్ల గ్రామీణ ప్ర‌జ‌లు డిజిట‌ల్ అక్ష‌రాస్యత సాధించార‌న్నారు.
18. ఎన్ఆర్ఎఫ్ ….. పరిశోధనకు పెద్ద పీట
దేశంలో శాస్త్రీయ ప‌రిశోధ‌నా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసేందుకు నేష‌న‌ల్ రీస‌ర్చ్ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అన్ని మంత్రిత్వ‌శాఖ‌ల్లో ఉన్న నిధులను ఎన్ఆర్ఎఫ్ ఏర్పాటు కోసం వినియోగించ‌నున్నారు. కొత్త విద్యావిధానాన్ని కూడా అమ‌లు చేయ‌నున్నారు. విద్యా వ్య‌వ‌స్థ స‌మూల ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా కొత్త పాల‌సీని తేనున్నారు. విదేశీ విద్యార్థుల కోసం స్ట‌డీ ఇన్ ఇండియా స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దీని కోసం 400 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్‌ ల తెలిపారు.
19. ఆదాయపు పన్ను …. ప్యాన్ లేకుంటే ఆధార్ ఇవ్వొచ్చు
అయిదు ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కు ఇక ప‌న్ను ఉండ‌దు. ప‌న్నుదారుల‌కు ప్ర‌భుత్వం ఓ ఆఫ‌ర్ కూడా ఇచ్చింది. ప్యాన్ నంబ‌ర్ లేని వారు ఆధార్ నంబ‌ర్‌ ఇచ్చినా స‌రిపోతుంది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె మాట్లాడుతూ.. ప‌న్నుదారులు త‌మ బాధ్య‌త‌ల‌ను సంపూర్ణంగా నిర్వ‌ర్తించార‌న్నారు. ప్ర‌త్య‌క్ష ప‌న్నులు11.37 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఆదాయ‌ప‌న్నులో ఎల‌క్రిక్ వాహ‌నాల‌కు మిన‌హాయింపు క‌ల్పించ‌నున్నారు. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై జీఎస్టీ 5 శాతం త‌గ్గించ‌నున్నారు. ఇండిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్న ఎన్ఆర్ఐల‌కు ఆధార్ కార్డులు జారీ చేయ‌నున్నారు. 400 కోట్ల ట‌ర్నోవ‌ర్ దాటిన కంపెనీల‌ను 25 శాతం బ్రాకెట్‌లో పెట్టిన‌ట్లు మంత్రి చెప్పారు.
20. ఎన్ఆర్ఎఫ్ ….. పరిశోధనకు పెద్ద పీట
దేశంలో శాస్త్రీయ ప‌రిశోధ‌నా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసేందుకు నేష‌న‌ల్ రీస‌ర్చ్ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అన్ని మంత్రిత్వ‌శాఖ‌ల్లో ఉన్న నిధులను ఎన్ఆర్ఎఫ్ ఏర్పాటు కోసం వినియోగించ‌నున్నారు. కొత్త విద్యావిధానాన్ని కూడా అమ‌లు చేయ‌నున్నారు. విద్యా వ్య‌వ‌స్థ స‌మూల ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా కొత్త పాల‌సీని తేనున్నారు. విదేశీ విద్యార్థుల కోసం స్ట‌డీ ఇన్ ఇండియా స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దీని కోసం 400 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల తెలిపారు.
20. పెట్రోల్‌, డీజిల్‌పై రూపాయి సెస్
పెట్రోల్‌, డీజిల్‌పై ఒక రూపాయి సెస్ విధించారు. బంగారం కొనుగోళ్ల‌పైన కూడా ప‌న్ను విధించ‌నున్నారు. దీంతో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌నున్నాయి. భార‌త పెట్రోలియం షేర్లు ఇవాళ 380.25 పాయింట్ల వ‌ద్ద ట్రేడింగ్ మొద‌లుపెట్టింది. బ‌డ్జెట్ నేప‌థ్యంలో ఇవాళ ఆ కంపెనీ
షేర్లు 2.42 శాతం ప‌డిపోయాయి.
21. కేంద్ర బడ్జెట్‌ నిరాశపరిచింది: విజయసాయి
బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపిందని వైకాపా ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన స్పందించారు. కేంద్ర బడ్జెట్‌ తమను నిరాశపరిచిందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు అమరావతి, పోలవరం నిర్మాణాలకు నిధుల ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్‌తో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని పెదవి విరిచారు. విభజన చట్టంలోని అంశాలపైనా ఏమీ మాట్లాడలేదన్నారు. ఏపీకి ఎన్ని నిధులిస్తున్నారనే విషయంపైనా స్పష్టత లేదని విమర్శించారు. విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.
22. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో ధరలు తగ్గేవి, పెరిగే వస్తువులు ఉన్నాయి. వాటిలో..
***ధరలు తగ్గేవి
*డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ *కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు *ఎలక్ట్రిక్‌ బైకులు
ధరలు పెరిగే వస్తువులు ఇవే..
*మెటల్‌ ఫర్నీచర్‌, మెటల్‌ రోడ్లు, కిటికీలు *ఏసీలు, స్టోన్‌ క్రషింగ్‌ ప్లాంట్లు *సీసీ కెమెరాలు, స్పీకర్లు, చార్జర్లు, డిజిటల్‌ వీడియో రికార్డర్లు *ఇంపోర్టెడ్‌, ప్రింటెడ్‌ పుస్తకాలు *జీడిపప్పు, సబ్బులు, ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ కవర్లు *రబ్బరు, టైర్లు, న్యూస్‌ ప్రింట్‌, మ్యాగజైన్లు *ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు *సెరామిక్‌ టైల్స్‌, గోడకు అంటించే టైల్స్‌ *స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అలాయ్‌ స్టీల్‌ వైర్‌