Agriculture

డబ్బుల్లేని వ్యవసాయానికి నిర్మలా ప్రతిపాదనలు

Indian Finance Minister Nirmala Sitaraman Proposes Zero Budget Farming

గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. శుక్రవారం ఆమె లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక సంస్కరణలను ప్రకటించారు. గ్రామాలు, పేదలు, రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ‘జీరో బడ్జెట్‌ ఫామింగ్‌(పెట్టుబడి లేని వ్యవసాయం’ విధానంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. ‘జీరో బడ్జెట్‌ వ్యవసాయం.. పెట్టుబడి లేకుండా చేసే వ్యవసాయం. అంటే రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడకుండా చిన్న చిన్న వ్యయాలతో అంతరపంటలు వేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రధాన పంటలకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ విధానం కొత్తదేమీ కాదు. దేశమంతా ఈ విధానాన్ని అవలంబించేలా చూస్తాం. రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది’ అని సీతారామన్‌ తెలిపారు.