*దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్నినమోదు చేస్తున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లు ఎగిసిన సూచీలు బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 440పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 133 పాయింట్లు క్షీణించి, 11900స్థాయికి దిగువకి చేరింది. దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, ఐటీ, ఆటో రంగాలు నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు, ఓఎన్జీసీ, వేదాంతా, టీసీఎస్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
* బంగారం ధరలు భారం కానున్నాయి. పార్లమెంట్లో శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మగువలకు ఇష్టమైన బంగారంపై పన్నుల భారం మోపారు. బంగారంపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను పెంచారు
*ఉద్యోగాల కల్పనవేగవంతమైన వృద్ధిని సాధించటంలో భాగంగా సూక్ష్మచిన్నమధ్య తరహా పారిశ్రామిక (ఎంఎ్‌సఎంఈ) రంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. చిరు సంస్థలుగా ఉన్న వాటిని స్టార్టప్స్చిన్న సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
*బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయిల్లో ఎస్బీఐపీఎన్బీసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఐసీఐసీఐవంటి పెద్ద బ్యాంకు లే అగ్రస్థానంలో ఉన్నాయి. బడా కంపెనీల బకాయిలు ఆర్థిక సంవత్సరంలో రూ. వేల కోట్లకు చేరినట్టు ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక తేల్చింది.
*సూక్ష్మ రుణ ఎగవేతదారుల్లో పట్టణవాసులే అధికంగా ఉన్నారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకుండా తప్పించుకునే ధోరణిలో గ్రామీణ ప్రజలతో పోల్చితే పట్టణవాసులదే పైచేయిగా ఉందని సీఐఆర్ఎఫ్ ఒక నివేదికలో తెలిపింది. మార్చి త్రైమాసికంలో గడువు కన్నా రోజులకు పైబడి బకాయిలున్న వారు పట్టణాల్లో శాతం ఉండగా గ్రామీణుల్లో శాతం ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది.
*దేశంలో సూక్ష్మచిన్నమధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ఖాదీ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్టు ఎంఎ్‌సఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. చైనాకు చెందిన అలీబాబాఅమెరికాకు చెందిన అమెజాన్ పోర్టళ్ల తరహాలోనే ఈ కొత్త పోర్టల్ ఉంటుందని ఆయన లోక్‌సభకు తెలిపారు. ఈ రెండు ఆన్లైన్ పోర్టళ్లు ఎంఎ్‌సఎంఈల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయనివాటి తరహాలోనే కొత్త పోర్టల్‌ను రూపొందించనున్నామని ఆయన వివరించారు.
*మూతపడిన జెట్ ఎయిర్వే్సపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిధుల మళ్లింపు సహా భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించటంతో ప్రభుత్వం ఎస్ఎఫ్ఐఓ విచారణకు ఆదేశించిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి.
*ఓరియెంట్ ఎలక్ట్రిక్.. మార్కెట్లోకి ఐలవ్ ఎల్ఈడీలైట్లను విడుదల చేసింది. ఇవి కళ్లుఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని తెలిపింది. సాధారణ ఎల్ఈడీ లైట్లలో ఉండే ఫ్లికర్ కళ్లకు హాని చేయటమేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయనిఅయితే తాము తెచ్చిన ఐలవ్ ఎల్ఈడీ లైట్లు ఎలాంటి హాని కలిగించవని ఓరియెంట్ ఎలక్ట్రిక్ ఎండీసీఈఓ రాకేశ్ ఖన్నా తెలిపారు. ఫ్లికర్ కంట్రోల్ టెక్నాలజీతో ఓరియెంట్ తయారు చేసిన ఈ లైట్లను ఇండియన్ మెడికల్ అకాడమీ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ సిఫారసు చేసిందన్నారు.
*మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లక్షల కోట్లకు చేరుకున్నాయి. క్రితం త్రైమాసికంతో పోల్చితే ఏయూఎంలో శాతం వృద్ధి నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యలో ఏయూఎం వృద్ధి చెందుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి.
*ఓరియెంట్ ఎలక్ట్రిక్.. మార్కెట్లోకి ఐలవ్ ఎల్ఈడీలైట్లను విడుదల చేసింది. ఇవి కళ్లుఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని తెలిపింది. సాధారణ ఎల్ఈడీ లైట్లలో ఉండే ఫ్లికర్ కళ్లకు హాని చేయటమేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయనిఅయితే తాము తెచ్చిన ఐలవ్ ఎల్ఈడీ లైట్లు ఎలాంటి హాని కలిగించవని ఓరియెంట్ ఎలక్ట్రిక్ ఎండీసీఈఓ రాకేశ్ ఖన్నా తెలిపారు. ఫ్లికర్ కంట్రోల్ టెక్నాలజీతో ఓరియెంట్ తయారు చేసిన ఈ లైట్లను ఇండియన్ మెడికల్ అకాడమీ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ సిఫారసు చేసిందన్నారు.
*కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతుండగానే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ పాయింట్ల మేర నష్టపోగా… నిఫ్టీ సైతం మరోసారి మార్కునకు దిగువన ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఆరంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ… లోక్‌సభలో ఆర్ధిక మంత్రి ప్రసంగం తర్వాత ఇక పైకి వెళ్లలేదు
భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య-07/05
Related tags :