ఖమ్మం-భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు చెందిన ప్రవాసులు శుక్రవారం మధ్యాహ్నం 22వ తానా మహాసభల రెండో రోజు వేడుకల్లో భాగంగా వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయకుమార్, ప్రముఖ వైద్యులు డా.తాళ్లూరి రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖులు మందలపు రవి, తాళ్లూరి పంచాక్షరయ్య, జక్కంపూడి కృష్ణమూర్తి, నల్లమల వెంకటేశ్వరరావు, తూనుగుంట్ల శిరీష, సునీల్ షావిలి, మిమిక్రీ రమేశ్, జక్కంపూడి రాము, దొడ్డా రవి, శ్రీధర్ తాళ్లూరి, బాబు బయ్యన్, కొండబోలు రవి, సుమంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిమిక్రీ రమేశ్ అధ్యక్షత వహించిన ఈ సమ్మేళనాన్ని సామినేని రవి, తాళ్లూరి మురళీ తదితరులు సమన్వయపరిచారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై, ఆ జిల్లా నుండి అమెరికాకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రుల భద్రత, విద్యా, వైద్యపరమైన అంశాలకు ప్రవాసుల తరఫున అందించాల్సిన సహాయ సహకారాలపై వక్తలు ప్రసంగించారు. అతిచిన్న వయస్సులో చదరంగంలో ప్రతిభ కనబరుస్తున్న రఘురామరెడ్డిని ఈ సందర్భంగా ప్రవాసులు అభినందించి సత్కరించారు. అతని క్రీడా జీవితానికి తోడ్పడాలనుకునేవారు సునీల్ షావిలిని సంప్రదించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.
తానా సభల్లో ఖమ్మం ప్రవాసుల సమ్మేళనం
Related tags :