తానా 22వ మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ఏర్పాట్లు బాగున్నాయి. మొదట రద్దీగా విందు ఆరంభం అయినప్పటికీ క్రమేపీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. విందు ఆరగించడానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు నిర్మించి తిరుమల క్యూలైనును తలపింపజేశారు. తెలుగు సాంప్రదాయ వంటకాలను రుచికరంగా ప్రవాసులకు అందజేశారు. గుత్తివంకాయ కూర, దోసకాయ పప్పు, వంకాయ దోసకాయ ఛట్నీ, దొండకాయ వేపుడు, చేపల పులుసు, కోడికూర, చిట్టిపొడి తదితర తెలుగు వంటకాలను రుచికరంగా వండివడ్డించారు. పెద్ద పెద్ద మహాసభలకు వంటను అందించడంలో సిద్ధహస్తుడైన తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, వర్జీనియాకు చెందిన ప్రముఖ హోటళ్ల వ్యాపారస్థుడు గౌర్నేని ప్రదీప్ ఆధ్వర్యంలో వేలాదిమంది ప్రతినిధులకు విందు ఏర్పాట్లు ఘనంగా చేశారు.
తానా విందు పసందు
Related tags :