ఎంతో మందిని బాధిస్తున్న మానసిక కుంగుబాటును దూరం చేసే అద్భుత లక్షణాలు పుట్టగొడుగుల్లో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వీటిలో మెదడును రీసెట్ చేసే ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తాజా పరిశోధనలో స్పష్టమైంది. డిప్రెషన్‌ను తగ్గించే గుణం పుట్టగొడుగుల్లో ఉందా అన్న విషయం మీద లండన్‌కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. పుట్టగొడుగుల నుంచి తీసిన ‘సైలో సైబిన్’ అనే పదార్ధాన్ని మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 19 మందికి ఇచ్చారు. దీన్ని తీసుకున్న తర్వాత తమ మెదడులో మంచి మార్పులు వచ్చాయని సగం మంది చెప్పారు. సైలోసైబిన్ ఇవ్వక ముందు, ఇచ్చిన ఒక రోజు తర్వాత రోగుల మెదడును స్కాన్ చేసి, మెదడులోని రెండు కీలక మార్పులను గుర్తించారు. అయితే ఈ అధ్యయనం డిప్రెషన్‌లో ఉన్న వారిపై మాత్రమే నిర్వహించారు. దీనిమీద ఇంకా పరిశోధనలు నిర్వహించాలని అంటున్నారు.
పుట్టగొడుగు ఒత్తిడి నుండి గొడుగు పడుతుంది
Related tags :