పాకిస్థాన్‌తో తలపడే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్‌హసన్ ప్రపంచకప్‌లో సచిన్ రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఇప్పటికే బంగ్లా క్రికెటర్ ఈ టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో 542 పరుగులు సాధించి భారత ఓపెనర్ రోహిత్‌శర్మ(544) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌తో తలపడే మ్యాచ్‌లో మరొక అర్ధశతకం సాధిస్తే సచిన్‌తో సమానంగా నిలుస్తాడు. 2003లో లిటిల్ మాస్టర్ 11 మ్యాచ్‌ల్లో ఒక శతకం, ఆరు అర్ధశతకాలతో 673 పరుగులు చేశాడు. ప్రస్తుత టోర్నీలో షకిబ్ రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలతో రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్ ఇవాళ పాకిస్థాన్‌పై చెలరేగితే సచిన్ తర్వాత ప్రపంచకప్‌లో ఏడుసార్లు 50కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు. దీంతో పాటు మరో రికార్డు సైతం అతడి ఖాతాలో చేరుతుంది. ప్రపంచకప్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన రెండో క్రికెటర్‌గా ఉన్న కుమార సంగర్కర(12) రికార్డుని సైతం సమానం చేస్తాడు. షకిబ్ ప్రస్తుతం (11) అర్ధశతకాలతో కొనసాగుతుండగా సచిన్ (21)తో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పరాజయం చెందడంతో ఆ జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకొంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు గెలిచి నాలుగు ఓటమిపాలవ్వగా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాకిస్తాన్‌తో ఆఖరి మ్యాచ్‌లో తలపడి విజయంతో వెనుదిరగాలని భావిస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ ద్వారా సెమీస్ చేరే అవకాశం ఉన్నప్పటికీ అది దాదాపు అసాధారణన్న సంగతి తెలిసిందే.
మాస్టర్ రికార్డుకు చేరువలో పాకిస్థానీ క్రికెటర్
Related tags :