ScienceAndTech

Facebook WhatsAppలు మళ్లీ డౌన్

Some users are reporting facebook and whatsapp are down for them

ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ సర్వీసులు బుధవారం ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయి. పోస్టులు, ఫొటోలు అప్ లోడ్, ఫీడ్, వీడియోలు తదితర ఫీచర్లలో ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయంటూ యూజర్లు ట్వీట్ల వరద పారించారు. ట్విట్టర్ లో కూడా డైరెక్టు మేసేజింగ్ ఫీచర్ లో కొందరు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలా మేజర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ సర్వీసులు పెద్ద ఎత్తున బ్రేక్ కావడం ఈ ఏడాది ఇది మూడోసారి.
**‘బ్రేక్’కు కారణమేంటి?
రొటీన్ మెయింటెనెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఓ చిన్న సమస్య తలెత్తిందని, అందుకే అప్ లోడింగ్, పోస్టింగుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని ఫేస్ బుక్ పేర్కొంది. మార్చి నెలలో ఓ ఫేస్ బుక్ సర్వర్ కాన్ఫిగరేషన్ మారిపోయి చాలా సేపు సేవలు నిలిచాయి.
**ఎందుకు ‘బ్రేకింగ్’ జరిగింది?
ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది ఫేస్ బుక్ ను వాడుతున్నారు. వీళ్ల డేటాను ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో ఫేస్ బుక్ ఉంచింది. కాబట్టి, వీళ్లందరికీ ఒకేసారి సర్వీసులు ఆగిపోవడం అసాధ్యం. ఫేస్ బుక్ లో మార్పులు చేయాలన్నా ఒకేసారి చేయరు. సర్వీసులు ప్రభావితం కాకుండా ప్రాంతాల వారీగా రిలీజ్ చేస్తారు. ఇలా చేసేప్పుడు అప్పుడప్పుడు బ్రేకింగ్ జరుగుతుంది. సదరు ప్రాంతాల్లో సర్వీసులు బ్రేక్ అవుతుంటాయి. బుధవారం కూడా ఇలానే జరిగింది.
**ఇకపైనా ‘బ్రేకింగ్స్’ ఉంటాయి
వందల కోట్ల మందిని యూజర్లను ఒకేసారి మేనేజ్ చేయడాన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాయి. దీని కోసం చాలా కంపెనీలు థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడుతున్నాయి. ఇలా ఆయా కంపెనీలు ఆ పనిలో చిన్న లోపాలు వచ్చినా, లక్షలాది మంది యూజర్లు దాని ఫలితాన్ని అనుభవించాల్సివుంటుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది.