ScienceAndTech

డ్రోన్ల పహారాలో వై.ఎస్.జగన్ నివాసం

YS Jagan House & Office In Tadepalli Under Drone Surveillance

తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రోజూ వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో అర్జీదారులు రావడం.. సీఎం కాన్వాయ్‌ వెళ్లే సమయంలోనూ ఆందోళనకారులు నినాదాలు చేయడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. సీఎం నివాసం చుట్టూ 200 మీటర్ల ప్రాంతాన్ని డ్రోన్‌ కెమెరాలతో పహారా కాస్తున్నారు.