వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించిన 22వ తానా మహాసభలు శనివారం సాయంత్రం కీరవాణి సంగీత విభావరితో ముగిశాయి. తానా అధ్యక్షుడు వేమన సతీష్ పదవీకాలం ముగిసింది. ఆయన తదుపరి బాధ్యతలను తాళ్లూరి జయశేఖర్‌కు అప్పగించారు. NTV చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం, భారత్ బయోటెక్ ఎల్లాకృష్ణలకు తానా పురస్కారాలు అందించారు. తానా తరఫున మిలియన్ డాలర్లు(₹7ఖోట్లు) విలువైన వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తామని ఈ సందర్భంగా ఎల్లా కృష్ణ ప్రకటించారు. భాజపా జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్, సీ.ఎం.రమేష్, మల్లు భట్టి విక్రమార్క, పువ్వాడ్ అజయకుమార్, రాజా కృష్ణమూర్తి, సీ.ఎం.రమేష్, అల్లరి నరేష్, పూజ హెగ్డే, నారా రోహిత్, స్మిత, సుమన్, రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు కార్యక్రమంలో అతిథులుగా హాజరయ్యారు. సభికులకు, కార్యకర్తలకు తానా 22వ మహాసభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు, ఛైర్మన్ డా.నరేన్ కొడాలిలు ధన్యవాదాలు తెలిపారు. సంగీత దర్శకుడు కీరవాణి సంగీత విభావరి అలరించింది.



















































