అమెరికావ్యాప్తంగా ఉన్న వైద్యులతో పాటు భారతదేశానికి చెందిన పలు విభాగాల్లో వైద్యులుగా పనిచేస్తున్న ప్రముఖులు 22వ తానా మహాసభల్లో సమావేశమయ్యారు. తమ అనుభవాలను నూతనంగా వస్తున్న రోగాలు, వ్యాధులు, వాటి చికిత్సా విధానాలు, నూతన సాంకేతికత, వైద్యుల మధ్య అవగాహన, సమన్వయం వంటి విషయాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. తానా సభలకు ఆతిథ్యం ఇస్తున్న GWTCS అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ ఈ సమావేశానికి సమనయ్వకర్తగా వ్యవహరించగా, ప్రముఖ పిల్లల మానసిక వైద్య నిపుణులు డా.నరిసెట్టి నవీన, డా.పాల్వాఇ సాయిలు సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రవాసాంధ్ర ప్రముఖ వైద్యులు డా.యడ్ల హేమప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తానా సభల్లో ప్రవాస వైద్యుల సమ్మేళనం
Related tags :