Movies

భద్రత ఉన్నా కూడా రేప్

Eisha Gupta Speaks Of Her Horrific Nightmare

బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆమె తాజా చిత్రం ‘వన్‌ డే: జస్టిస్‌ డెలివర్డ్‌’ విడుదల కావడంతో గత రాత్రి స్నేహితులతో సంతోషంగా గడిపారు. అయితే, ఈ వేడుకలు అనుకున్నంత ఆనందంగా ముగియలేదని తెలుస్తోంది. ఓ హోటల్‌ యాజమాని తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె సోషల్‌ మీడియాలో తెలిపారు. రోహిత్‌ విగ్‌ అనే వ్యక్తి ప్రవర్తించన తీరు ఎంత క్రూరంగా ఉందని, తనకెంతో అసౌకర్యంగా, అభద్రంగా అనిపించిందని ఆమె వెల్లడించారు. తన చుట్టు ఇద్దరు గార్డులు ఉన్నా.. అతను స్వైరవిహారం చేశాడని, అలాంటివాళ్లు నాశనమవ్వాలని, అతని ప్రవర్తన వల్ల తాను రేప్‌కు గురవుతున్నట్టు అనిపించిందని పేర్కొన్నారు. ‘నాలాంటి ఒక మహిళ దేశంలో అభద్రతకు గురైతే.. ఇక సామాన్య మహిళల పరిస్థితేమిటి? ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నా పక్కనే ఉన్నా రేప్‌కు గురవుతున్నట్టు అనిపించింది. రోహిత్‌ విగ్‌ నువ్వొక స్వైరంలా ప్రవర్తించావు. నువ్వు నాశనమవ్వాలి’ అని ఈషా గుప్తా పేర్కొన్నారు. రోహిత్‌ విగ్‌ లాంటి వారి వల్లే మహిళలు ఎక్కడైనా అభద్రతా భావానికి లోనవుతారని, గుచ్చిగుచ్చి చూస్తూ చూపులతోటే రేప్‌ చేసేలా అతడు కనిపించాడని, ఫ్యూచర్‌ రేపిస్ట్‌లా కనిపిస్తున్న అతను ఎవరో మీకు తెలుసా? అంటూ తన సోషల్‌ మీడియా పేజీల్లో పేర్కొన్నారు. తెలుగులో ‘వినయ విధేయ రామ’ సినిమాలో రాంచరణ్‌ సరసన ప్రత్యేక గీతంలో నర్తించిన ఈషా గుప్తా బాలీవుడ్‌లో ‘టోటల్‌ ధమాల్‌’, ‘రుస్తుం’ వంటి సినిమాల్లో నటించారు.