►మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం… అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. విటమిన్ సి, ఫైబర్… శరీరంలో హాని చేసే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
►మామిడి పండును తినడం వల్ల పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి
►నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది
►మామిడి పండు మంచి జీర్ణకారి ∙ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది
►మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజమైన బరువు పెరిగే అవకాశం ఉంది
►ఇందులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడి పండ్లు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్త కణాల వృద్ధికి దోహదపడుతుంది
►ఈ పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది
►వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది
►చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది
►మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది
►శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచే బీటా కెరటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంది. ఇది మన శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి శరీరాన్ని బలోపేతం చేస్తుంది
►మామిడి పండుకి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయఫలం.
పాదాల పగుళ్లు: మామిడి జిగురు తీసుకుని, ఆ పరిమాణానికి మూడు రెట్లు నీళ్లు కలిపి పేస్టులా చేసి, ప్రతిరోజు పాదాలకు లేపనంలా పూసుకోవాలి.
పంటినొప్పి, చిగుళ్ల వాపు: రెండు కప్పుల నీళ్లు తీసుకుని మరిగించాక, రెండు పెద్ద చెంచాల మామిడి పూతను జత చేసి మరికొంత సేపు మరగనిచ్చి, దింపేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయొచ్చు.
కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరు చేసి తడి పోయేవరకు ఆరబెట్టాలి. పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా చేసి, ఒక సీసాలో భద్రపరచుకోవాలి. కొన్నిరోజుల పాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
ఆర్శమొలలు: మామిడి జీడిని వేరు చేసి, ఎండబెట్టి, పొడి చేయాలి. పెరుగు మీది తేటకు ఈ పొడి జత చేసి తీసుకోవాలి.
జ్వరం: మామిడి వేర్లకు కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దను అరికాళ్లకు, అరిచేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని తీసుకుని మామిడికాయలను సంవత్సరం పాటు ఊరబెట్టాలి. ఆ తరవాత ఈ నూనెను తల నూనెగా వాడుకోవాలి.
చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకుల నుంచి రసం తీసి కొద్దిగా వేడి చేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి.
ముక్కు నుంచి రక్త స్రావం: మామిడి జీడి నుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.