భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీరుద్దరూ తిలకించారు. సచిన్, పిచాయ్ పక్క పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోను.. బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోపై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. గూగుల్‌లో పిచాయ్ క్రికెట్ స్కోర్ వివరాలు అప్‌డేట్ చేస్తున్నారని ఒకరు.. టెక్నాలజీ, స్పోర్ట్స్ జతకలిసి వచ్చే కొత్త తరానికి క్రికెట్ పాఠాలు నేర్పాలి అని మరొకరు కామెంట్ చేశారు. ఇంతకూ ఈ ఇద్దరూ లెజెండ్స్ ఏం మాట్లాడుకున్నారబ్బా అని మరో నెటిజన్ ఉత్సాహం చూపించాడు. కాగా మ్యాచ్‌కు ముందు యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పిచాయ్ భారత్, ఇంగ్లండ్ దేశాలు ప్రపంచకప్ ఫైనల్ చేరాలని ఆకాక్షించారు. చిన్నతనంలో క్రికెటర్ కావాలని కలలు కనేవాడినని.. సునీల్ గవాస్కర్, సచిన్‌ను ఆరాధించేవాడినని చెప్పుకొచ్చారు. ఇక భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సుందర సచిన్ ద్వయం
Related tags :