* 9 పుస్తకాల ఆవిష్కరణ
* అలరించిన మేడసాని అవధానం
* పుసకాతావిష్కరణలో పాల్గొన్న తాళ్లూరి పంచాక్షరయ్య, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
22వ తానా మహాసభల్లో ముగింపు రోజు అయిన శనివారం నాడు వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో తెలుగు సాహితీ సౌరభం ఆహ్లాదపరిచింది. ప్రవాస చిన్నారులు, భారతదేశం నుండి వచ్చిన పలువురు రచయితల పుస్తకాలను ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తాళ్లూరి పంచాక్షరయ్య, తానా మాజీ అధ్యక్షుడు డా.జంపాల చౌదరిలు ముఖ్య అతిథులుగా హాజరయి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 9 పుస్తకాలను ఆవిష్కరించారు. తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ తెలుగులోనే తృప్తి ఉందని, తనకు తెలుగు తప్ప వేరే భాష రాదని అందుకే తాను 90ఏళ్ల వయస్సులో ఇంత చలాకీగా ఉన్నానై తెలిపి ఆయన నిజాం హయాంలో చదువుకున్న తెలుగు పద్యాలను చదివి వినిపించారు. యార్లగడ్డ మాట్లాడుతూ బౌద్ధ మతం భారతదేశంలో పుట్టినప్పటికీ అది ఇతర ఆసియా దేశాల్లో వృద్ధి చెంది భారతదేశంలో కనుమరుగయిందని అలానే తెలుగు భాష తెలుగు రాష్ట్రాల్లో బలహీనపడుతుందేమో గానీ అమెరికాలో, విదేశాల్లో కాలరెగురుసుకుని వాషింగ్టన్ డీసీ పురవీధుల్లో పచార్లు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చివుకుల ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. మేడసాని అవధానానికి భారీ స్పందన లభించింది. హాలు మొత్తం సాహితీప్రియులతో కిక్కిరిసిపోయింది.