వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. తన అప్‌మింగ్ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఓ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనను విమర్శించాడంటూ అతడిపై ఫైర్ అయ్యారు. కంగనా- రాజ్‌కుమార్ రావు సినిమా జడ్జిమెంటల్ హై క్యా సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే… కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మణికర్ణిక సినిమాను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంగనా పూర్తిగా దేశభక్తురాలిగా మారి ఈ సినిమాను తెరకెక్కించిందని సదరు జర్నలిస్టు విమర్శించారు. అదే విధంగా పాకిస్తాన్లో షోలు నిర్వహించే భారతీయ ముస్లిం నటీమణులను వ్యతిరేకించే కంగనా… తన మణికర్ణిక సినిమాను మాత్రం అక్కడ రిలీజ్ చేయడం విశేషం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఈ క్రమంలో తాజా మూవీ ప్రమోషన్‌కు వచ్చిన అతడిపై కంగన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నా మణికర్ణిక సినిమా గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు. ఆ సినిమా తెరకెక్కించి తప్పు చేశానా? జాతీయవాదిగా నాపై ముద్ర వేశావు కదూ. గతంలో నీకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అప్పుడు బాగా మెచ్చుకున్నావు. మరి తర్వాత ఏమైంది’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ పరిణామంతో కంగుతిన్న సదరు జర్నలిస్టు తను కంగన నటనను విమర్శించినందుకే తనపై ఇలా కక్ష గట్టిందని వాపోయాడు.
కంగన ఫైర్స్
Related tags :