ఇటీవల వైకాపా ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా బే ఏరియాలో విజయోత్సవం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ విజయోత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ వైద్యులు డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఈ సభలో నిర్వహించారు. వైకాపా స్థానిక నాయకులు వుయ్యూరు సురేష్ రెడ్డి, గోగులమూడి సీతారామిరెడ్డి, ఉమాశంకర్ తదితరుల ఆద్వర్యంలో జరిగింది. మిల్ పిటాస్ లోని ఇండియా కన్వెన్షనల్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బే ఏరియాలో వైకాపా విజయోత్సవం
Related tags :