డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి ఇది వరకే పూరి కనెక్ట్స్ అనే సంస్థను స్థాపించారు. దీని ద్వారా కొత్త హీరో హీరోయిన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. అలాగే పూరి జగన్నాథ్ స్వంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ వ్యవహారాలను కూడా ఛార్మినే పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారమే ఆన్లైన్లో బట్టలను అమ్మడం. ఇందులో మగవారి దుస్తులనే అమ్ముతారట. ఈ విషయాన్ని ఛార్మి తన ట్విట్టర్ ద్వారా చార్మి తెలిపారు.నిన్న ప్రీ రిలీజ్ వేడుకల్లో ఈ విషయాన్ని పూరి స్టేజ్‌పై అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఛార్మి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే beismart.in అనే వెబ్‌సైట్‌ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారట. ముందుగా ఆర్డర్ చేసిన వారికి 30 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుందని తెలియజేశారు ఛార్మి.
కలిసి వ్యాపారం
Related tags :