Fashion

పట్టుబట్ట ఉతికేందుకు ఓ లెక్క ఉంది

Tips to wash and clean silk sarees-telugu fashion news

సాధారణంగా పట్టు బట్టలమీద మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు. అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పదికాలాల పాటు మన్నికగా ఉంటాయి. పట్టుచీరలను చెరువు, నది నీటితోనే ఉతకాలి. బోరునీటితో ఉతికేవారు ఆ నీటిలో చిటికెడు బోరాక్స్‌ కలపాలి. నాణ్యమైన, తేలికపాటి సబ్బును ద్రవ లేదా పొడి రూపంలో వాడాలి. బోరునీరైతే తేలికపాటి డిటర్జెంట్‌ వాడాలి. పట్టు బట్టలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి నీడ పట్టున ఆరేయాలి. పట్టుబట్టల మీద కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడినీటిలో కొద్దిగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి ఆ నీటితో ఉతకాలి. ఙపట్టు బట్టల మీద చాక్‌లెట్‌ మరకలు పడితే వేడి నీటిలో జాడించి ఉతికితే పోతాయి. అదే…పెరుగు, వెన్న వంటి మరకలు పడితే ఆ భాగంలో ఒక చుక్క కార్బన్‌ పట్టు బట్టల మీద ఇంక్‌ లేదా లిప్‌స్టిక్‌ మరకలు పడితే ఆ భాగంలో పేపర్‌ టవల్‌ను ఉంచి వెనుకనుంచి డ్రైక్లీనింగ్‌ ద్రావణం లేదా ఆల్కహాల్‌ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు. అదే నెయిల్‌ పాలిష్‌ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌ లో ముంచితే సరిపోతుంది. బురద మట్టి మరకలు పడితే పట్టు వస్త్రాన్ని ఆరనిచ్చి కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ తో తుడిచి ఉతికితే సరిపోతుంది. షూ పాలిష్‌ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్‌ పూయాలి. పట్టుబట్టలను ప్లాస్టిక్‌ సంచుల్లో గాక పేపర్‌ లేదా కాటన్‌ సంచుల్లోనే ఉంచాలి. పట్టుబట్టలున్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి. పట్టుబట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా గాక కవరులో పెట్టి పెట్టాలి. పట్టు బట్టలను అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి.లేకుంటే మడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.