DailyDose

బాలకృష్ణకు చెప్పే చేరాను-రాజకీయ–07/09

Ambica Krishna Says NBK Knows His Move To BJP - Daily Politics - July 9 2019

* చంద్రబాబు నాయుడు తెదేపా నేతలను భాజపాలోకి పంపుతున్నరనే అభిప్రాయం చాలా మందిలో వచ్చిందని తెదేపా సీనియర్ నేత అంబిక కృష్ణ అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో తెదేపా పటిష్టవంతం అవడమనేది సామాన్యమైన విషయం కాదన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన పధకాలను ప్రజల్లోకి చేరవేయడంలో సఫలీకృత మయ్యరని అన్నారు. చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని, అందులో మొదటిది మోడీతో వ్యతిరేకత, రెండవది లోకేష్ అసమర్ధత కూడా కారణమని ఆయన అన్నారు. తాను భాజపాలోకి వెళ్తున్న విషయం బాలకృష్ణకు ముందే తెలుసనని ఆయన అన్నారు.
* అమరావతిలో దొంగలు పడ్డారు – నారా లోకేష్
సీఎం జగన్‌ పట్టిసీమ దండగ అన్నారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. నెల ఆలస్యమైనా ఇప్పటికి పంపుల ద్వారా నీటిని విడుదల చేశారన్నారాయన. ఇప్పుడు పట్టిసీమపై ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని ప్రశ్నించారు. వైసీపి సర్కారుకు ఎలాంటి అవగాహన లేదంటూ ఎద్దేవా చేశారు లోకేష్‌. వైసీపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. 120 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని విమర్శించారు. ఒక్క అవకాశంతో జగన్‌ ప్రభుత్వం వచ్చిందని…. తమ ఓపికను పరీక్షించొద్దన్నారు. తాము తిరుగుబాటు చేస్తే వైసీపీ నేతలు గ్రామాల్లో తిరగలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* జగ్గారెడ్డికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సవాల్
అవినీతి, అక్రమాల పై బహిరంగ చర్చకు సిద్ధమా.. అంటూ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి సవాల్ విసిరారు. ఈ రోజున సంగారెడ్డి లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చింతా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా… ప్రజలకు కనీసం అందుబాటులో లేకుండా జగ్గారెడ్డి అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నాడన్నారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడే హక్కే లేదని అన్నారు. త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం జగ్గారెడ్డి మాయ మాటలు చెబుతున్నాడన్నారు.ఓట్లు వేసిన ప్రజలకు సేవ చేయకుండా… జగ్గారెడ్డి అవినీతి, అక్రమలు చేశారని చింతా ప్రభాకర్ ఆరోపించారు. ఆయన్ను చూసి ఓట్లు వేసిన ప్రజలు ఈసాడించుకుంటున్నారని తెలిపారు. సింగూర్ ప్రాజెక్ట్ గురించి జగ్గారెడ్డి ప్రతీసారి అవగాహన లేమితో అవాస్తవాలు మాట్లాడుతున్నాడని అన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా 2005, 2008, 2015 లో సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిగా ఎండిపోయిందని, ప్రాజెక్ట్ ఎండిపోయిడం కొత్తమీ కాదన్నారు ప్రభాకర్.
* భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం మాజీ జడ్పీ ఛైర్మన్‌ ఈదర హరిబాబు భాజపాలో చేరారు. దిల్లీలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. హరిబాబు కుమారుడు భరత్‌ కూడా భాజపాలో చేరినట్లు సమాచారం. 1994లో ఒంగోలు నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున హరిబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
* మీ తలుపు తట్టి పింఛను ఇస్తాం: సీఎం జగన్‌
కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో మాట్లాడుతూ.. ‘‘ సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మీ తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చు” అని అన్నారు.
* ప్రజలు బీజేపీకి ఆ అధికారం ఇవ్వలేదు: సిద్ధరామయ్య
కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి కారణం భారతీయ జనతా పార్టీయేనని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి అవకవాశం ఇవ్వలేదని, కాంగ్రెస్-జేడీఎస్‌లకు అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. ప్రభుత్వాల్ని అస్థిరం చేసి కూల్చడం భారతీయ జనతా పార్టీ అలవాటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధరామయ్యా మాట్లాడుతూ ‘‘ప్రభుత్వాన్ని అస్థిరం చేసి కూల్చడం భారతీయ జనతా పార్టీకి అలవాటే. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని బీజేపీ అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్-జేడీఎస్‌లకు ఆ అవకాశం ఇచ్చారు. మా కూటమి(కాంగ్రెస్-జేడీఎస్‌)కి 57శాతం ప్రజలు మద్దతు పలికారు’’ అని అన్నారు.
* కౌంటర్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు- చినరాజప్ప
వైసీపీ దాడుల్లో టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు 6 గురు చనిపోయారని, మరో 96 మందిపై కేసులు నమోదు చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దాడులు చేసి, కౌంటర్ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. తమ శాసన సభ్యులు ప్రభుత్వ సమావేశాలకు వెళ్తే దాడులు చేస్తున్నారన్నారన్నారు.
తాము కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్నింటికీ పేర్లు మార్చి.. వైఎస్ అని పేరు పెట్టడం సరికాదని చినరాజప్ప ఆరోపించారు. పింఛను రెండు వేలు టీడీపీ ఇచ్చిందని అందరికి తెలుసన్నారు. ఇప్పుడు ఇంకో 250 ఎక్కువ ఇచ్చి.. తాము ఎక్కువ ఇస్తున్నామని వైసీపీ ప్రచారం చేసుకుంటోందని చినరాజప్ప ఆరోపించారు. స్థానిక శాసన సభ్యులను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
* టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్‌
టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్‌ సమర్పించారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఆరోపించారు. ఈ మేరకు బలరాంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బలరాం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారు. బలరాంకు నలుగురు పిల్లలైతే ఆఫిడవిట్‌లో ముగ్గురని పేర్కొన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామ’ని తెలిపారు.
*వారిని అనర్హులుగా ప్రకటించాలి:సిద్ధరామయ్య
కర్ణాటక రాజకీయాలు గంటగంటకీ ఆసక్తిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించడానికి భేటీ అయిన సీఎల్పీ సమావేశం ముగిసింది. అనంతరం ఆ పార్టీ సీనియర్‌ నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో 20 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడతామని హామీ ఇచ్చామని..అందులో భాగంగానే తాజాగా 21 మంది మంత్రులు రాజీనామా చేశారన్నారు. అయినా అందరికీ మంత్రివర్గంలో చోటు కల్పించడం సాధ్యం కాదన్నారు. రాజీనామా చేసిన వారంతా ఇంకా మంత్రులుగానే కొనసాగుతున్నారని.. వారి పత్రాలు ఇంకా ముఖ్యమంత్రికి చేరాల్సి ఉందన్నారు.
*తెదేపా ఆధ్వర్యంలో జలసిరికి హారతి
కృష్ణా జిల్లాలో తెదేపా ఆధ్వర్యాన గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. హనుమాన్‌జంక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి నీటికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హారతిచ్చారు. గత మూడేళ్లుగా తెదేపా ప్రభుత్వం ‘జలసిరికి హారతి’ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చింది. ప్రస్తుతం అధికారంలో లేనందున పార్టీ తరఫున ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ, జవహర్‌, వంశీ, బచ్చుల అర్జునుడు, కొనకళ్ల తదితరులు పాల్గొన్నారు.
*సీఎం జగన్‌కు ముద్రగడ బహిరంగ లేఖ
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడం కోసం తెదేపా అధినేత చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, ఆయన గెలుపు కోసం కాపు సామాజిక వర్గమంతా పోరాడితే తెదేపా ప్రభుత్వం అరాచక పాలన చేసిందని లేఖలో పేర్కొన్నారు.
*తెరాసకు సోమారపు గుడ్‌ బై
తెరాస సీనియర్‌ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి రాజీనామా లేఖలు సమర్పించారు. రామగుండం నియోజవర్గం నుంచి గత శాసనసభ ఎన్నికల్లో సత్యనారాయణ పరాజయం చవిచూశారు.అప్పటినుంచి పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన అనుచరులతో కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను అడగకుండానే సీఎం గతంలో నాకు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారన్నారు. కానీ, ప్రస్తుతం తెరాసలో క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. కనీసం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో తన ఓటమికి మాజీ ఎంపీ, ముఖ్య నాయకులే కారణమని దుయ్యబట్టారు.
*గాంధీభవన్లో వైఎస్సార్ జయంతి వేడుకలు
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలను టీపీసీసీ సోమవారం గాంధీభవన్లో నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు మల్లురవి, కుమార్రావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ తదితరులు..వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ..రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు, విత్తనాలు, రుణమాఫీ, బోధన రుసుం వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. వైఎస్సార్ను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని, ఆయన సిద్ధాంతాలు, విధానాలను అమలు చేయాలన్నారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ నాయకుడని, ఆయనను ఎవరైనా పార్టీ నేతలు వ్యతిరేకిస్తే అది వారి వ్యక్తిగతమని గూడూరు నారాయణరెడ్డి పేర్కొన్నారు
*ప్రతి నియోజకవర్గంలో ‘లక్ష లక్ష్యం’ చేరాలి
తెరాస సభ్యత్వ నమోదును పెద్దఎత్తున జరపాలని.. ఒక్కో నియోజకవర్గంలో లక్ష లక్ష్యాన్ని సాధించేందుకు శ్రేణులు కృషి చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల దృష్ట్యా పట్టణాలు, నగరాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్లెల్లోనూ ప్రతి ఇల్లూ తిరిగి పార్టీలో చేర్పించాలని కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తెరాస సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాలు, మండలాలు, పట్టణాలవారీగా నమోదు, పుస్తకాలు తిరిగి ఇవ్వడం, వాటి డిజిటలీకరణ ప్రక్రియపై ఆరా తీశారు.
*రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ…
రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ… భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామిపై ఫిర్యాదులు దాఖలయ్యాయి. సోమవారం రాజస్థాన్లోని జైపుర్, టోంక్, బుండి, బారన్ కోర్టుల్లో పలువురు కాంగ్రెస్ నేతలు వీటిని దాఖలు చేశారు. రాహుల్గాంధీ మత్తుమందు (కొకైన్) తీసుకుంటున్నట్టు స్వామి ఆరోపించారని, అవి తమ మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
*సోనియా గాంధీతో రాజ్ఠాక్రే భేటీ
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ఠాక్రే సోమవారం దిల్లీలో యూపీయే ఛైర్పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
*మున్సిపల్ ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ’
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ కన్వీనర్ తుమ్మనపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణాలను, నగరాలను నివాసయోగ్యంగా తీర్చిదిద్దే ఎజెండాను ప్రజల డిమాండ్గా మారుస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన లోక్సత్తా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని ఆయన కోరారు.
*విత్తనాలడిగితే లాఠీలతో కొడతారా?
రైతులకు విత్తనాలను అందించలేని వైకాపా ప్రభుత్వం రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదమని తెదేపా నాయకులు ధ్వజమెత్తారు. ‘విత్తనాలడిగితే లాఠీలతోÈ కొడుతున్నారు. పోలీస్స్టేషన్లలో విత్తనాలను సరఫరా చేస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన రైతుల్ని రోడ్డెక్కించారు. విత్తనాల తయారీ అంటే ఇడ్లీ, ఉప్మా చేసినట్లు కాదని వ్యవసాయశాఖ మంత్రే వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం రైతులపట్ల వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం’ అని మండిపడ్డారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. జగన్ పరిపాలన తుగ్లక్ పాలనలా ఉందని తెదేపా నేతలు విమర్శించారు.
*స్థానిక ఎన్నికలపై వారంలో స్పష్టత
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు.. ఎలా నిర్వహించాలన్న అంశంపై వారం రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి స్పష్టతనివ్వనున్నారు. ఎన్నికల నిర్వహణపై పార్టీ ముఖ్యనేతల బృందం అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదించినట్లు తెలిసింది. ఎన్నికలను వెంటనే నిర్వహించడానికే ఆ బృందం నివేదికలో మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ వివరాలతోపాటు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా రప్పించిన సమాచారాన్నీ క్రోడీకరిస్తున్నారు.
*వైఎస్ ఆశయాలను కొనసాగిస్తాం: రఘువీరా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతో ఆదర్శనీయమని, వాటి ఫలాలు అన్ని వర్గాలకు అందాయన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన వైఎస్ జయంతి వేడుకల్లో రఘువీరా పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.
*అచ్చెన్నాయుడు ఎన్నికను రద్దు చేయండి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున గెలుపొందిన కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికను రద్దు చేయాలంటూ ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పేరాడ తిలక్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ‘ఓ క్రిమినల్ కేసు వివరాల్ని ఎన్నికల నామినేషన్ ప్రమాణ పత్రంలో వెల్లడించకుండా అచ్చెన్నాయుడు గోప్యంగా ఉంచారు. టెక్కలి ఠాణాలో నమోదైన క్రిమినల్ కేసును మాత్రమే ప్రస్తావించారు.
*పార్లమెంటు ప్రాంగణంలో వైఎస్ విగ్రహం ప్రతిష్ఠించాలి: ఎంపీ బాలశౌరి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని వైకాపా ఎంపీ బాలశౌరి కోరారు. ఈ మేరకు లోక్సభ సభాపతి ఓం బిర్లాకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారంటూ పలు అంశాలు ఆ లేఖలో ప్రస్తావించారు.
*వైఎస్ ఆశయాలను కొనసాగిస్తాం: రఘువీరా
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతో ఆదర్శనీయమని, వాటి ఫలాలు అన్ని వర్గాలకు అందాయన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన వైఎస్ జయంతి వేడుకల్లో రఘువీరా పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.
*కాంగ్రెస్ అధ్యక్షుడి శాశ్వత సభ్యత్వ హోదా తొలగింపు
దేశంలో మరో రాజకీయ దుమారం చెలరేగింది! జలియన్ వాలాబాగ్ జాతీయ స్మారక ట్రస్టులో… కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఉండే శాశ్వత సభ్యత్వాన్ని తొలగించే దిశగా మోదీ సర్కారు చర్యలు ప్రారంభించింది. సోమవారం లోక్సభలో ‘జలియన్ వాలాబాగ్ సవరణ బిల్లు’ను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండే ఈ ట్రస్టులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి, లోక్సభలో విపక్ష నేత, పంజాబ్ గవర్నర్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు… కేంద్ర ప్రభుత్వం సూచించే ముగ్గురు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అయితే- కాంగ్రెస్ అధ్యక్షుడికి ఉండే శాశ్వత సభ్యత్వ హోదాను తొలగించాలని, లోక్సభలో విపక్ష నేతకు బదులు… లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను సభ్యుడిగా గుర్తించాలని, నామినేటెడ్ సభ్యులను ఎప్పుడైనా తొలగించే అధికారం ట్రస్ట్ అధ్యక్షుడికి కల్పించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
*కర్ణాటక పరిణామాలతో కేంద్రానికి సంబంధం లేదు
కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పార్టీ మారాలని ఏ ఎమ్మెల్యేపైగానీ, ఎంపీపైగానీ ఒత్తిడి తేలేదని అన్నారు. పార్లమెంటు పవిత్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సోమవారం లోక్సభలో శూన్యగంటలో కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌధరి ప్రస్తావించిన అంశానికి సమాధానంగా రాజ్నాథ్ ఈ వివరణ ఇచ్చారు. తొలుత చౌధరి మాట్లాడుతూ కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చివేయడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
*సోనియా గాంధీతో రాజ్ఠాక్రే భేటీ
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ఠాక్రే సోమవారం దిల్లీలో యూపీయే ఛైర్పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
*అభివృద్ధిలో అగ్రగామి ఏపీ
అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి కానుందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి తెలిపారు. సోమవారమిక్కడ ఏపీ భవన్లో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. వైకాపా లోక్సభాపక్షనేత మిథున్రెడ్డి, పార్టీ విప్ మార్గాని భరత్, ఎంపీలు పాల్గొన్నారు.