ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘కోన’ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.25.30 లక్షలు. సాధారణ కారు మాదిరిగానే కనిపిస్తున్న ఈ ‘కోన’లో ఫ్రంట్ గ్రిల్, ఎక్స్‌హాస్ట్ వంటివి వుండవు. ఆటోమేటిక్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ప్లాస్టిక్ బాడీ క్లాడింగ్ అండ్ రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ‘కోన’ తెలుపు, సిల్వర్, బ్లూ, బ్లాక్ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. డ్యూయల్ టోన్ (వైట్ కార్ విత్ బ్లాక్ రూఫ్) ఆప్షన్ కూడా ఉంది. ఇంకా కారు లోపలి భాగంలో 7 అంగుళాల డిజిటల్ డ్యాష్ బోర్డు, హెడ్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్త, ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.అలాగే కారులో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సర్, రియర్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులోని మరికొన్ని స్పెషాలిటీస్ పర్మనెంట్ మాగ్నెట్ సిక్రోనస్ మోటార్‌ని కలిగి ఉంటుంది. 136 హెచ్‌పీ పవర్, 395 టార్క్ దీని సొంతం. 0-100 కిలోమీటర్ల వేగాన్ని 9.7 సెకన్లలో అందుకుంటుంది. ఇందులో 39.2 కిలోవాట్ లిథియమ్ అయన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 452 కిలోమీటర్లు వెళుతుంది. 50 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జర్‌తో అయితే ఇది కేవలం 57 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది. అదే స్టాడర్డ్ ఏసీ చార్జర్ ద్వారా అయితే 6 గంటల 10 నిమిషాలు సమయం పడుతుంది. కంపెనీయే తన ఔట్‌లెట్స్ వద్ద చార్జింగ్ పోర్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. అలాగే కారుతో పాటు చార్జర్ కూడా ఇస్తుంది. అంతే కాకుండా పెట్రోల్ బంకుల్లో కూడా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది. కారుపై 3 ఏళ్ల వారంటీ ఉంటుంది. బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది.
కోన కార్ ధర పాతిక లక్షలు
Related tags :