వాట్సాప్ గ్రూపుల్లో చేరొద్దంటూ సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. స్కూలు, కాలేజ్వంటి పదుల సంఖ్యలో మెంబర్లు ఉండే గ్రూపులలో అందరినీ గుర్తించడం సాధ్యం కాదన్నారు. సైనిక రహస్యాల కోసం గ్రూపుల ద్వారా సైనికులపై నిఘా వేసే అవకాశం ఉందన్నారు. ఇలాంటి గ్రూపుల నుంచే మాల్వేర్ఎటాక్చేసి, ఫోన్లోని సమాచారం మొత్తం దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రూపులలో కాకుండా ఒకరితో నేరుగా చేసే మెసేజ్లే సేఫ్అని చెప్పారు. ఆర్మీకి సంబంధించిన వివరాలు కానీ, తమ పోస్టింగ్వివరాలు కానీ సోషల్మీడియాలో పోస్ట్చేయకూడదన్నది మిలిటరీ రూల్.. ప్రతీ సైనికుడు దీనిని తప్పనిసరిగా ఫాలో అవుతాడని ఉన్నతాధికారులు చెప్పారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఈ సూచనలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.
భారత సైన్యం వాట్సాప్ వాడదు
Related tags :