Movies

నేను మారను

Nithya Menen Hates Changes

నాకలా ఉండటమే ఇష్టం అంటోంది నటి నిత్యామీనన్. ఇతర హీరోయిన్లకంటే ఈ అమ్మడు కాస్త భిన్నమని చెప్పకతప్పదు. ఎవరో ఏదో అంటారని కాకుండా తనకు అనిపించింది చేసేసే నటి నిత్యామీనన్. విమర్శలను అస్సలు పట్టించుకోని నటి ఈ అమ్మడు. ఆ మధ్య కాస్త లావెక్కింది. దానిపై కొందరు కామెంట్స్ చేస్తే, తానెలా ఉండాలో తనకు బాగా తెలుసని, తన గురించి ఆలోచించడం మానేసి ఎవరి పని వారు చేసుకోవడం మంచిదని చురకలు వేసింది. ఆ మధ్య అవకాశాలు సన్నగిల్లాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ చేతి నిండా చిత్రాలతో బిజీ అయిపోయింది. హిందీతో సహా పలు భాషల్లో. తమిళంలో సైకో అనే చిత్రంలో నటిస్తోంది.