Movies

నవ్వించండి. నచ్చుతారండి.

Rashi Khanna Says She Likes People Who Makes Her Laugh

‘‘నవ్వడం ఒక యోగం అనే మాటను నేను నమ్ముతాను. దురాలోచనలను దూరంగా జరిపి మనసారా నవ్వితే ఎంత ఒత్తిడైనా పటాపంచలవుతుంది’’ అని అంటున్నారు రాశీ ఖన్నా. వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రీకరణలో బిజీబిజీగా ఉన్నారు రాశీ ఖన్నా. ఇన్స్టాగ్రామ్లో నిత్యం యాక్టివ్గా, రకరకాల ఫోజులతో ఫొటోలు అప్లోడ్ చేయడం ఈమెకు బాగా అలవాటు. రాశీ మాట్లాడుతూ ‘‘అర్ధ రూపాయి కూడా ఖర్చులేకుండా, మనల్ని అలంకరించే ఆభరణం నవ్వు. ఎలాంటి కష్టాలనుంచైనా బయటపడేసే ఆయుధం నవ్వు. నన్ను ఎవరైనా నవ్విస్తే వాళ్లు నాకు బాగా నచ్చుతారు. నోరారా నవ్వితే రోగాలన్నీ మటుమాయమైపోతాయని నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే మనల్ని నవ్వించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. మన దరహాసాలను కోరుకునేవాళ్లు నిజంగా గొప్పవాళ్లే’’ అని చెప్పారు.