చినుకుల కాలంలో ముఖం తాజాగా ఉండాలంటే… అలంకరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే…
* అలంకరణ చేసుకునే ముందు కొద్దిగా ప్రైమర్ రాసుకోవడం తప్పనిసరి. ఫౌండేషన్ ఎక్కువసేపు చెదిరిపోకుండా ఉంటుంది.
*ఈ కాలంలో మస్కారా వీలైనంత వరకూ వాడకూడదు. ఒకవేళ తప్పనిసరైతే… వాటర్‌ప్రూఫ్ రకాన్ని ఎంచుకోవాలి. అదీ ఒక కోటింగ్ మాత్రమే వేసుకోవాలి.
*వాతావరణం పొడిగా ఉన్నా సరే… ఈ కాలంలో అలంకరణ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఐషాడోలు, బ్లష్‌ల జోలికి పోకూడదు.
*ఫినిషింగ్ స్ప్రేలు దొరుకుతాయి. అలంకరణ అంతా పూర్తయ్యాక దాన్ని కొద్దిగా వాడి చూడండి. ముఖం ఎక్కువసేపు తాజాగా కనిపిస్తుంది. మీరు వేసుకున్న కొంచెం అలంకరణ అయినా చెదిరిపోకుండా ఉంటుంది.
కొంచెం ప్రైమర్ వేస్తే వానాకాలం మేకప్ చెరగదు
Related tags :