దేశంలో జరుగుతున్న ఆర్థికపరమైన నేరాలు విస్తుగొలుపుతున్నాయి. 2008-09 మొదలు గత 11 సంవత్సరాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నమోదు చేసిన మోసాల కేసులు 44,016 కాగా వీటికి సంబంధించి మొత్తం రూ.1,85,625 కోట్లని కేంద్రం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. 2016-17 ఏడాదిలో అత్యధికంగా రూ.25,883.99 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి 3,927 కేసులు నమోదయ్యాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.2012-13లోనూ 4,504 కేసులకు సంబంధించి రూ.24,819.36 మేర మోసాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయే నిందితుల ఆస్తుల స్వాధీనానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత, మరికొన్ని కఠిన చర్యలకు ఉపక్రమించటంతో బ్యాంకులను మోసగించే కేసులు తగ్గుముఖంపట్టాయని మంత్రి వివరించారు.
భారతదేశంలో భారీగా ఆర్థిక నేరాలు

Related tags :