DailyDose

భారతదేశంలో హత్యలు తగ్గాయి

Murder Rate In India Decreased According To 2015 Stats

భారత్లో హత్యలు గత ఆరేళ్లలో 10% మేర తగ్గినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం హత్యల పరంపర పైపైకి ఎగబాకుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం విడుదల చేసిన ‘ద గ్లోబల్ స్టడీ ఆన్ హోమిసైడ్’ నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. 2016లో హత్యకు గురైనవారిలో పురుషులు 20%లోపే అని పేర్కొంది. 2009లో లక్ష మందిలో 3.8 మంది హత్యకు గురికాగా… 2015 నాటికి ఆ రేటు 3.4కి తగ్గినట్టు విశ్లేషించింది.