కావల్సినవి:
కీరదోస – ఒకటి పెద్దది, బ్రకోలీ లేదా క్యాలీఫ్లవర్ పువ్వులు – అరకప్పు, క్యాప్సికం – ఒకటి, క్యాబేజీ ఆకులు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు, బ్రెడ్ స్లైసులు – రెండు, నీళ్లు – రెండుకప్పులు, ఆలివ్‌నూనె – టేబుల్‌స్పూను, ఉప్పు, మిరియాలపొడి – రుచికి సరిపడా.
తయారీ:
కూరగాయలన్నింటినీ కడిగి ముక్కల్లా కోయాలి. తరవాత మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని మిగిలిన పదార్థాలన్నీ వేసి పొయ్యిమీద పెట్టాలి. ఈ మిశ్రమం కొద్దిగా ఉడికాక నీళ్లూ, ఆలివ్‌నూనె, తగినంత ఉప్పూ, మిరియాలపొడి, వెల్లుల్లి తరుగు వేస్తే సరిపోతుంది.